Haryana CM: అక్క‌డ న‌మాజ్ చేస్తే.. ఎట్టి పరిస్థితుల్లోనూ స‌హించం.. హర్యానా సీఎం సంచ‌ల‌న నిర్ణ‌యం

By Rajesh KFirst Published Dec 11, 2021, 1:04 PM IST
Highlights

బహిరంగ ప్రదేశాల్లో నమాజ్‌ చేస్తే సహించేది లేద‌ని హ‌ర్యానా సీఎం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు.నిర్దేశించిన ప్రదేశాలలో నమాజ్ లేదా పూజలు చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేదని, మతపరమైన చ‌ర్య‌ల‌ను బ‌హిరంగ ప్ర‌దేశాల్లో చేయ‌రాద‌ని తెల్చి చెప్పారు. ఆక్రమణల్లో ఉన్న వక్ఫ్ భూములను, స్థలాలను ఉచితంగా అందించేందుకు మర్గదర్శకాలను రూపొందిస్తున్నామని ఖట్టర్ తెలిపారు.
 

Haryana CM Manohar Lal Khattar: గురుగావ్ లో బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ చేస్తే సహించేది లేదని  హర్యానీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ హెచ్చరించారు. మ‌త‌ప‌ర‌మైనా కార్య‌క్ర‌మాలు చేసుకునే హక్కు అందరికి ఉంటుంది..కానీ ఇతరులకు ఇబ్బంది కలిగించ‌కుండా చేసుకోవాల‌ని సూచించారు. కానీ, ఇత‌రుల‌కు ఇబ్బంది క‌లిగేలా.. ట్రాఫిక్ నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా రోడ్ల‌పై ప్రార్థనలు లేదా న‌మాజ్ చేస్తే.. ఎట్టి ప‌రిస్థితిలోనూ స‌హించేది లేద‌ని హెచ్చ‌రించారు. నిర్ణీత‌, నిర్ధేశించిన ప్రదేశాల్లోనే ముస్లింలు ప్రార్థనలు చేసుకోవాలని స్పష్టంచేశారు. కాగా ముస్లింలు ప్రతీ శుక్రవారం మసీదుకు వెళ్లి నమాజ్ లు చేసుకుంటుంటారనే విషయం తెలిసిందే.

 హిందూ, ముస్లిం వర్గీయుల మధ్య ఘర్షణలు జరిగిన నేపథ్యంలో 2018లో ఓ ఒప్పందం జరిగింది. బహిరంగ ప్రదేశాలలో నిర్దేశిత ప్రాంతాల్లో ముస్లింలు ప్రార్థనలు చేసుకోవచ్చని ప్రభుత్వ యంత్రాంగం అప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. బహిరంగ ప్రదేశాలలో ముస్లింలు ప్రార్థనలు చేస్తున్న తరుణంలో హిందూ, ముస్లీంల మ‌ధ్య ఘర్షణలు త‌లెత్తున్నాయి. ఇరు వర్గాల మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ స‌మ‌స్య‌ను శాంతియుతంగా, సామరస్య పూర్వకమైన పరిష్కారించ‌డం కోసం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిపారు.

Read Also: https://telugu.asianetnews.com/national/treatment-for-aids-with-protein-in-milk-patented-hcu--r3xwx2

ఈ విష‌యంలో ఇరుపక్షాలతో మళ్లీ చర్చలు జరుపుతామని, ఏ స‌మ‌స్య‌నైనా సామరస్య పూర్వంగా ప‌రిష్క‌రించుకోవాల‌ని అన్నారు ఖట్టర్. అప్పటి వరకు ముస్లీంలు తమతమ ఇళ్లలో లేదా నిర్దేశిత ప్రార్థనా స్థలాల్లోనే ప్రార్థనలు చేయాలని సూచించారు. ముస్లీంలు గానీ, హిందువులు గానీ త‌మ త‌మ ప్రార్థనా స్థలాల్లో ప్రార్థనలు చేయడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, ప్రార్థనల కోసమే ఆ స్థలాలను నిర్మించారని ఖట్టర్ చెప్పారు. కానీ, బహిరంగ ప్ర‌దేశాల్లో ఆ పనులు చేయడం వ‌ల్ల ఇత‌రులకు ఇబ్బందులు ఏర్ప‌డుతున్నాయి. బహిరంగంగా నమాజ్ చేసే ఆచారాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని అన్నారు.  ఇప్ప‌టికే ఈ విష‌యంపై పోలీసు అధికారుల‌తో చ‌ర్చించ‌మ‌ని తెలిపారు. ఎక్క‌డెక్క‌డ అనుమతి ఇవ్వాలో  అనేది త‌మ‌కు తెలుసునని తెలిపారు. అలాగే..  వక్ఫ్ బోర్డు భూములు ఏదైనా ఆక్రమణకు గురైతే ఆ విష‌యాన్ని ప‌రిష్కరిస్తామనీ, వాటిని త్వ‌ర‌లోనే  అందుబాటులోకి వచ్చేలా మార్గదర్శకాలను రూపొందిస్తున్నామని ఖట్టర్ తెలిపారు.

Read Also: https://telugu.asianetnews.com/national/omicron-scare-section-144-imposed-in-mumbai-for-48-hours-r3xp5n

గత కొంత కాలంగా గురుగ్రామ్ లో శుక్రవారం రోజు ముస్లింలు బహిరంగ ప్రదేశాల్లో అంటే రోడ్లపై బారులు తీరి నమాజులు చేసుకోవటంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఆయా రోడ్లలో పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈక్రమంలో హిందూ, ముస్లిం వర్గీయుల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి.  ఈ స‌మ‌స్యను ఏ విధంగా ప‌రిష్క‌రించాలో తెలియ‌క‌పోవ‌డంతో గురుగ్రామ్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అధికారులు త‌ల‌లు ప‌ట్టుకున్నారు. ఈ విష‌యంపై ముస్లిం పెద్దల‌తో చ‌ర్చలు జ‌రిపినా.. ఆ స‌మ‌స్య పరిష్కారం కాలేదు. అలాగే ముస్లీంలు పార్థ‌న‌లు చేస్తున్నారు. ఈ తరుణంలో ఇరు వ‌ర్గాల మ‌ధ్య వివాదం కొనసాగుతోంది. ఈ స‌మ‌స్య ప‌రిష్క‌రం కోసమే సీఎం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది.  ముస్లీం వ‌ర్గాలు మాత్రం ఈ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తున్నాయి.

click me!