అతడికి 17.. ఆమెకు 26.. పెళ్లి చేసుకున్న నెల రోజుల తర్వాత భార్యను అమ్మేశాడు.. చివరకు..

By team teluguFirst Published Oct 23, 2021, 5:32 PM IST
Highlights

అతనికి 17 ఏళ్లు.. ఆమెకు 26 ఏళ్లు.. ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా  మారింది. దీంతో వారిద్దరు పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే పెళ్లైనా నెల రోజుల తర్వాత ఆ మైనర్ యువకుడు  తన భార్యను రూ. 1.80 లక్షలకు వేరే వ్యక్తికి అమ్మేశాడు.

అతనికి 17 ఏళ్లు.. ఆమెకు 26 ఏళ్లు.. ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా  మారింది. దీంతో వారిద్దరు పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే పెళ్లైనా నెల రోజుల తర్వాత ఆ మైనర్ యువకుడు  తన భార్యను రూ. 1.80 లక్షలకు వేరే వ్యక్తికి అమ్మేశాడు. ఈ ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. వివరాలు.. ఒడిశాకు చెందిన యువకుడికి తనకంటే వయసులో పెద్దదైన  మహిళ మధ్య ప్రేమ చిగురించింది. వీరిద్దరు ఈ ఏడాది జూలైలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే దంపతులు ఇద్దరు ఇటుక బట్టీలో పని చేయడానికి రాయ్‌పూర్, ఝాన్సీ మీదుగా రాజస్థాన్ వెళ్లారు. అక్కడ కొన్ని  రోజులు పనిచేసిన  తర్వాత.. మైనర్ యువకుడు తన భార్యను రాజస్తాన్‌లోని బరన్ జిల్లాకు చెందిన 55 ఏళ్ల వ్యక్తికి (Odisha teen sold wife) అమ్మేశాడు.

అతని వద్ద నుంచి లక్షా  80 వేల రూపాయలు తీసుకున్నాడు. అనంతరం ఆ డబ్బులతో స్మార్ట్‌ఫోన్ కొనుకున్నాడు. ఆ తర్వాత ఒడిశాలోని తన స్వగ్రామానికి తిరిగివచ్చాడు. అతడు ఒక్కడే ఇంటికి తిరిగివచ్చాడని తెలుసుకున్న మహిళ తల్లిదండ్రులు..  తమ కూతురి గురించి ప్రశ్నించారు. అయితే మహిళ తనను విడిచిపెట్టి వెళ్లినట్టుగా యువకుడు చెప్పాడు. అయితే అతడి మాటలు నమ్మని..  మహిళ తల్లిదండ్రులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Also read: కంగనా రనౌత్ వర్సెస్ జావేద్ అక్తర్.. కంగనాకు భారీ షాక్.. ఆధారాలు లేవని ఆ పిటిషన్ తోసిపుచ్చిన కోర్టు..

దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అతని మాటలపై అనుమానం వచ్చిన పోలీసులు.. కాల్ రికార్డులను పరిశీలించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో యువకుడు అసలు నిజం అంగీకరించాడు. తన భార్యను రాజస్తాన్‌ను చెందిన వ్యక్తికి విక్రయించినట్టుగా చెప్పాడు. దీంతో మహిళ బలంగీర్‌కు పోలీసుల బృందం రాజస్తాన్‌కు వెళ్లింది. 

Also read:హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. రెండు చోట్ల భారీగా డ్రగ్స్ పట్టివేత..

చివరకు పోలీసులు బరన్ జిల్లాలో మహిళను గుర్తించారు. అయితే అక్కడి స్థానికులు మాత్రం మహిళను పోలీసులు తీసుకెళ్లకుండా అడ్డుకునేందుకు యత్నించారు. తాము మహిళను డబ్బులు పెట్టి కొనుగోలు చేశామని వాదించారు. దీంతో పోలీసులు అతి కష్టం మీద ఆ మహిళను ఆమె తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. ఇక, ఆ యువకుడిని శుక్రవారం జువైనల్ కోర్టు ముందు హాజరుపరిచి, కరెక్షనల్ హోమ్‌కు పంపారు.

click me!