నర్స్ కు వార్డ్ బాయ్ ల వేధింపులు.. తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం.. !

By AN TeluguFirst Published May 27, 2021, 1:33 PM IST
Highlights

ఓ వైపు కరోనా వేధిస్తోంటే మరోవైపు తోటి ఉద్యోగులే కీచకులుగా మారుతున్న ఘటనలు అక్కడక్కడా వెలుగు చూస్తున్నాయి. ఫ్రంట్ లైన్ వారియర్లుగా ఉంటూ ఎంతోమందికి నిరంతరం సేవ చేస్తున్న వైద్యసిబ్బంది విషయంలో ఇలాంటి సంఘటనలు జరగడం గర్హనీయం.

ఓ వైపు కరోనా వేధిస్తోంటే మరోవైపు తోటి ఉద్యోగులే కీచకులుగా మారుతున్న ఘటనలు అక్కడక్కడా వెలుగు చూస్తున్నాయి. ఫ్రంట్ లైన్ వారియర్లుగా ఉంటూ ఎంతోమందికి నిరంతరం సేవ చేస్తున్న వైద్యసిబ్బంది విషయంలో ఇలాంటి సంఘటనలు జరగడం గర్హనీయం.

వార్డు బాయ్ లు కరోనా పేషంట్ల మీద అత్యాచారానికి, లైంగిక వేధింపులకు పాల్పడడం ఇప్పటివరకు తెలిసిన ఘటనలే... తాజాగా ఓ నర్సు మీదే వార్డు బాయ్ లు వేధింపులకు పాల్పడ్డారు. దీంతో ఆ నర్సు ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. 

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సీతాపూర్ జిల్లా కేంద్రంలో తాజాగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రిలో పనిచేస్తున్న ముగ్గురు వార్డు బాయ్ లు తనను పలుసార్తు వేదిస్తున్నారని ఆరోపిస్తూ ఓ నర్సు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యా యత్నం చేసింది. 

సకాలంలో ఇది గమనించిన వైద్యులు వెంటనే నర్సుకు చికిత్స చేశారు. నర్సు కోలుకుంటుందని వైద్యులు చెప్పారు. ఈ ఘటనలో నర్సును వేధించిన ఆ ముగ్గురు వార్డ్ బాయ్ లను అరెస్టు చేశామని సర్కిల్ ఇన్ స్పెక్టర్ పీయూష్ కె సింగ్ చెప్పారు. 

కాగా,  రెండు రోజులుగా ఇండియాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి.  మూడు రోజుల క్రితం రెండు లక్షలకు దిగుమన నమోదైన కేసులు రెండు రోజులుగా  స్వల్పంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో  2,11,299  కరోనా కేసులు నమోదయ్యాయి. బుధవారం నాడు 21,57,857 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తే 2,11,299 మందికి కరోనా సోకిందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. 

సుమారు 40 రోజుల తర్వాత  మే 24వ తర్వాత రోజువారీ కేసులు 1,96,427 నమోదయ్యాయి.  అయితే  గత రెండు రోజులుగా కరోనా కేసులు రెండు లక్షలపైనే నమోదౌతున్నాయి. మహారాష్ట్రలో కరోనా కేసులు భారీగా తగ్గాయి.లాక్‌డౌన్ నేపథ్యంలో మహారాష్ట్రలో కరోనా కేసులు భారీగా తగ్గాయి.

ఢిల్లీలో కూడ కరోనా  కేసులు తగుతున్నాయి. గత 24 గంటల్లో  దేశంలోని తమిళనాడులో అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. 33,764 రికార్డయ్యాయి. తమిళనాడు తర్వాతి స్థానంలో కేరళ నిలిచింది. మహరాష్ట్రలో 24,752 కేసులు రికార్డయ్యాయి. కర్ణాటకలో 26,811, ఏపీలో 18,286 కేసులు నమోదయ్యాయి.గత 24 గంటల వ్యవధిలో దేశంలో 3,847 మంది కరోనాతో చనిపోయారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 3,15,235కి చేరుకొంది. 
 

click me!