అమానుషం : కుక్క మెడకు బెలూన్లు కట్టి గాల్లోకి.. ఓనర్ అరెస్ట్..

Published : May 27, 2021, 01:22 PM IST
అమానుషం : కుక్క మెడకు బెలూన్లు కట్టి గాల్లోకి.. ఓనర్ అరెస్ట్..

సారాంశం

పెంపుడు కుక్క మీద ఓ యూట్యూబర్ పైశాచికంగా ప్రవర్తించాడు. కుక్క మెడకు హైడ్రోజన్‌ బెలూన్లు కట్టి వదిలేశాడు. ఆ బెలూన్లు పైకి వెళ్తుండగా.. కుక్క కూడా వాటితో పాటు గాల్లోకి వెళ్తుంటే అతడు పైశాచిక ఆనందం పొందాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ఫైనల్ గా మారాయి.  దీంతో అతడి తీరుమీద నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. అతనిపై చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.

 ఢిల్లీలోని మాలవ్యనగర్ కు చెందిన గౌరవ్ జాన్ ఓ యూట్యూబర్.  తన యూట్యూబ్ ఛానల్ లో వ్యూస్ కోసం ఇలా కుక్క మెడకు బెలూన్లు కట్టి వీడియోలు రూపొందించాడు. ఆ కుక్కకు డాలర్ అని పేరు పెట్టుకున్నాడు. దాని బర్త్ డే సందర్భంగా ఈ విధంగా చేశాడు. 

మళ్లీ ఇండియాలో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు...

ఇంటి దగ్గరున్న పార్కు దగ్గర అతడు తన తల్లితో కలిసి హైడ్రోజన్ బెలూన్లు కట్టి ఎగరేస్తున్నారు. ఇంట్లో, బయట చాలా సార్లు కుక్కకు బెలూన్లు మొత్తం కట్టి గాలిలోకి వదిలారు. గాల్లోకి బెలూన్లతో పాటు కుక్క కూడా ఎగురు తుండడంతో అతడు, అతడి తల్లి, కొందరు యువతులు కేరింతలు వేస్తూ పైశాచిక ఆనందం పొందారు.

ఈ పిచ్చి చేష్టలను చూసిన కొందరు మాలవ్యనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గౌరవ్‌ జాన్‌తో పాటు అతడి తల్లిపై కూడా కేసు నమోదైంది. ఈ చర్యకు అతడు క్షమాపణలు చెప్పాడు. జంతు ప్రేమికులు, వ్యూయర్స్ కు క్షమాపణలు చెబుతూ వీడియో రూపొందించాడు. అయితే అతడిని అరెస్టు చేసినట్లు సమాచారం.

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం