జేఈఈ 2023 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల: రెండు విడతలుగా పరీక్షలు

Published : Dec 15, 2022, 10:09 PM ISTUpdated : Dec 15, 2022, 10:11 PM IST
జేఈఈ  2023  మెయిన్స్ పరీక్షల షెడ్యూల్  విడుదల: రెండు విడతలుగా పరీక్షలు

సారాంశం

జేఈఈ 2023  మెయిన్స్ పరీక్షల షెడ్యూల్  ను  నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ  గురువారం నాడు ప్రకటించింది.  రెండు విడతలుగా పరీక్షలు నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జనవరి, ఏప్రిల్ మాసాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. 

న్యూఢిల్లీ: జేఈఈ 2023  మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ ను  నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ  గురువారంనాడు విడుదల చేసింది. జేఈఈ 2023  మెయిన్స్ పరీక్షలను రెండు విడతలుగా నిర్వహించనున్నారు.తొలి విడత  జేఈఈ  పరీక్షలను  వచ్చే ఏడాది జనవరి  మాసంలో నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ మాసంలో  రెండో విడత  పరీక్షలు నిర్వహిస్తారు. 

2023  జనవరి జేఈఈ మెయిన్స్  తొలి విడత పరీక్షలను  వచ్చే ఏడాది జనవరి  24,25, 27, 28,29, 30, 31 తేదీల్లో నిర్వహించనున్నారు. ఇవాళ్టి నుండి జేఈఈ మెయిన్స్ పరీక్షలు రాసేందుకు  ఇవాళ్టి నుండి  వచ్చే ఏడాది జనవరి  12వ తేదీ వరకు  తమ ధరఖాస్తులను చేసుకోవచ్చని ఎన్‌టీఏ ప్రకటించింది.

ఇక జేఈఈ రెండో విడత పరీక్షలకు గాను  వచ్చే ఏడాది ఫిబ్రవరి  7వ తేదీ నుండి ధరఖాస్తు చేసుకోవచ్చు.  వచ్చే ఏడాది మార్చి  ఏడో తేదీ లోపుగా తమ ధరఖాస్తులను ఆన్ లైన్ లో  సమర్పించాలి. రెండో విడత పరీక్షలను  వచ్చే ఏడాది ఏప్రిల్  6,7,8,9,10,11,12 తేదీల్లో నిర్వహించనున్నారు.బీఈ, బిటెక్ కోర్సుల్లో ప్రవేశం కొరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.13 భాషల్లో జేఈఈ పరీక్షలు నిర్వహిస్తారు.  ఇంగ్లీష్, హిందీ, బెంగాల్,  గుజరాత్,  కన్నడ, మళయాళం,  మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ్, తెలుగు, ఉర్ధూ భాషల్లో  పరీక్షలు నిర్వహించనున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ  వెబ్ సైట్ లో  ధరఖాస్తు చేసుకోవాలి.  ఆన్ లైన్ లోనే ధరఖాస్తు చేసుకోవాలని ఎన్ టీ ఏ తెలిపింది.  

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం