సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ఎన్ఆర్ఐను నమ్మి ఓ మహిళా న్యాయవాది మోసపోయింది. తనకు పెళ్లి కాలేదని, మంచి అమ్మాయి కోసం చూస్తున్నట్లు లాయర్ ను నమ్మించిన ఎన్నారై.. తీరా అతని గురించి నిజం తెలియడంతో ఆ తర్వాత తన అసలు రూపం బయటపెట్టాడు.
సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ఎన్ఆర్ఐను నమ్మి ఓ మహిళా న్యాయవాది మోసపోయింది. తనకు పెళ్లి కాలేదని, మంచి అమ్మాయి కోసం చూస్తున్నట్లు లాయర్ ను నమ్మించిన ఎన్నారై.. తీరా అతని గురించి నిజం తెలియడంతో ఆ తర్వాత తన అసలు రూపం బయటపెట్టాడు.
ఆ న్యాయవాది ఫోటోలను అశ్లీలంగా చిత్రీకరించి వాటిని పేరుతో సెక్స్ వర్కర్ పేరుతో ఇంటర్నెట్ లో పెట్టాడు. ఇది తెలిసిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
వివరాల్లోకి వెళితే ఆస్ట్రేలియా మెల్బోర్న్ ఉండే లోఖండ్ వాలా అనే ఎన్నారై తో ఢిల్లీ దర్వాజా లోని సలాత్వాద్‌కు చెందిన 29 ఏళ్ల మహిళ న్యాయవాదికి గతేడాది ఏప్రిల్ లో ఫేస్ బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ఇద్దరూ చాటింగ్ చేసుకునేవారకూ వెళ్లింది.
ఈ క్రమంలో ఒకరోజు సదరు ఎన్నారై తనకు 34 యేళ్లని, ఇంకా పెళ్లి కాలేదని మంచి అమ్మాయి కోసం చూస్తున్నట్లు లోఖండ్ వాలా లాయర్ కు చెప్పాడు. ఆమెను నమ్మించడం కోసం.. అంతటితో ఆగకుండా ఏకంగా ఓ నకిలీ బర్త్ సర్టిఫికెట్ కూడా పంపించాడు.
అది చూసిన ఆమె నిజం అని నమ్మేసింది. అలాగే లోఖండ్ వాలాను పెళ్లి చేసుకునేందుకు ఓకే చెప్పింది. దాంతో అతను ఆమె ఫోటోలు అడిగి తీసుకున్నాడు. ఆమె ఫొటోలతో పాటు తన మొబైల్ నెంబర్ కూడా ఇచ్చింది.
ఈ క్రమంలో ఒకరోజు లాయర్ కు ఓ మహిళ నుంచి ఫోన్ వచ్చింది. లోఖండ్ వాలాకు వివాహమైందని, అతని వయసు 48 ఏళ్ల ని 17 ఏళ్ల కూతురు కూడా ఉన్నట్లు ఆమె చెప్పింది. అది విన్న న్యాయవాదికి మైండ్ బ్లాక్ అయింది.
వెంటనే ఈ విషయమై లోఖండ్ వాలా ను నిలదీసింది. దాంతో తనకసలు పెళ్లే కాలేదని, ఫోన్ చేసిన మహిళ నా అన్నయ్య భార్య అని, వారిద్దరికీ సంబంధించిన ఓ పెళ్లి ఫోటోను కూడా ఆమెకు పంపించాడు.
ఇది ఇలా ఉండగా కొన్ని రోజుల తర్వాత ఇంతకుముందు ఫోన్ చేసిన మహిళ ఈసారి వాట్స్అప్ వీడియో కాల్ చేసింది. అందులో లోఖండ్ వాలా పక్కన ఓ మహిళ ఉండడం కనిపించింది. అందులో కనిపిస్తున్న మహిళనే అతని భార్య వీడియో కాల్ చేసిన మహిళ చెప్పింది. దాంతో అప్పటి నుంచి ఆమె మాట్లాడడం మానేసింది.
ఈ క్రమంలో అతడు ఆమె తన వద్ద ఉన్న ఆమె ఫోటోలను అశ్లీలంగా చిత్రీకరించి ఇంటర్నెట్ లో పెట్టాడు పైగా ఆమెను వ్యభిచారి గా పేర్కొన్నాడు. ఆ ఫొటోలు చూసిన బాధితురాలు కరంజ్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.