నిర్భయ కేసులో మరో ట్విస్ట్... తాను మైనర్ అంటూ దోషి..

By telugu teamFirst Published Dec 19, 2019, 9:29 AM IST
Highlights

నేరం జరిగినప్పుడు తాను మైనర్ అని అతడు పేర్కొన్నాడు. తన వయస్సును నిర్ధారించకుండానే ఉరిశిక్షను విధించారని పవన్ గుప్తా చెప్పుకొచ్చాడు. దీనిపై ఢిల్లీ హైకోర్టు గురువారం విచారణ జరపనుంది.
 

నిర్భయ కేసు దోషులకు మరి కొద్ది రోజుల్లో ఉరి శిక్ష వేస్తారని అందరూ అనుకున్నారు. దాదాపు ఏడేళ్ల నుంచి తమ కుమార్తె చావుకి కారణమైన వారికి శిక్ష పడాలని... నిర్భయ తల్లి న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నారు. మరికొద్ది రోజుల్లో అది నేరవేరుతుందని ఆమె భావించారు. తలారీ కూడా దొరికేశారని... ఉరి తీయడమే మిగిలందని అనుకున్నారు. కానీ... అంతలో వారి ఉరి వాయిదా పడింది. ఈ క్రమంలో... ఈ నిర్భయ కేసుకు సంబంధించి మరో ట్విస్ట్ వచ్చి పడింది.

నిర్భయ కేసులోని నలుగురు దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా... మరోసారి హైకోర్టును ఆశ్రయించాడు. నేరం జరిగినప్పుడు తాను మైనర్ అని అతడు పేర్కొన్నాడు. తన వయస్సును నిర్ధారించకుండానే ఉరిశిక్షను విధించారని పవన్ గుప్తా చెప్పుకొచ్చాడు. దీనిపై ఢిల్లీ హైకోర్టు గురువారం విచారణ జరపనుంది.

కాగా ఈ కేసులో తనకు ఉరిశిక్షను రద్దు చేయాలంటూ దోషి అక్షయ్ సింగ్ వేసిన రివ్యూ పిటిషన్‌ను ఇవాళ సుప్రీం కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. నలుగురు దోషులకు ఉరిశిక్ష వేయడమే కరెక్ట్ అని ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. 

మానవత్వం మంట గలిపే రీతిలో నలుగురు నిందితులు దారుణానికి ఒడిగట్టారని.. వారు క్షమించడానికి కూడా అర్హులు కారు అంటూ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంలో స్పష్టం చేశారు. ఇక అక్షయ్ సింగ్ పిటిషన్‌ను సుప్రీం కొట్టివేసి కొన్ని గంటలు కూడా అవ్వకముందే.. మరో దోషి పవన్ గుప్తా తన వయస్సుపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడం గమనర్హం.
 

click me!