జగన్మోహన్ రెడ్డి బాటలో ఉద్ధవ్ థాక్రే

By Siva KodatiFirst Published Dec 18, 2019, 5:55 PM IST
Highlights

మహారాష్ట్ర ప్రభుత్వం కూడా దిశ చట్టంపై కసరత్తు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర హోంమంత్రి ఏక్‌నాథ్ శిండే బుధవారం శాసనమండలిలో ప్రకటించారు.

మహిళలు, చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడిన వారిపై కేసు నమోదైన తర్వాత 14 రోజుల్లో విచారణ పూర్తి చేసి 21 రోజుల్లో శిక్ష పడేలా ఏపీ ప్రభుత్వం దిశ చట్టాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే బాటలో దేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు నడిచేందుకు ప్రయత్నిస్తున్నాయి.

తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం కూడా దిశ చట్టంపై కసరత్తు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర హోంమంత్రి ఏక్‌నాథ్ శిండే బుధవారం శాసనమండలిలో ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు భద్రంగా ఉండేలా ప్రస్తుతమున్న చట్టాలను కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది.

Also Read:దిశ చట్టంపై స్పందించిన డిల్లీ సర్కార్... జగన్ ప్రభుత్వానికి లేఖ

దీనితో పాటు ఆకృత్యాలకు పాల్పడే కేసుల్లో బాధితురాళ్లకు సత్వర న్యాయం కల్పించేందుకు ఏపీ సర్కార్ రూపొందించిన దిశ లాంటి చట్టాన్ని ఇక్కడ కూడా తీసుకొచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని ఆయన తెలిపారు.

కాగా ఇటీవల హైదరాబాద్ నగర శివార్లలోని శంషాబాద్‌ వద్ద పశువైద్యురాలు దిశపై జరిగిన అత్యాచారం, హత్య ఘటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత వారం ప్రవేశపెట్టిన దిశ బిల్లును రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించిన సంగతి తెలిసిందే. 

దిశ చట్టాన్ని తీసుకువచ్చి మహిళా రక్షణకు కట్టుబడి వున్నట్లు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన జగన్ ప్రభుత్వంపై డిల్లీ ప్రభుత్వం ప్రశంసలు కురిపించింది. డిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదేశాల మేరకు అధికారులు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి  ఓ లేఖ రాసింది.

Also Read:ట్విట్టర్ ఇండియా టాప్ ట్రెండ్స్‌లో #APDishaAct

దిశ ఘటన దేశం మొత్తాన్ని కలచివేసిందని... అలాంటి దుర్ఘటనతో చలించిన ఏపి ప్రభుత్వం ఇలాంటి నేరాలకు పాల్పడే నిందితులను అతి కఠినంగా శిక్షించడానికి ఏకంగా ఓ కొత్త చట్టాన్ని తీసుకురావడం అభినందనీయమన్నారు.

click me!