మైనర్ బాలికపై బంధువుల సామూహిక అత్యాచారం.. దానిని వీడియో తీసి..

Published : Dec 07, 2019, 12:01 PM IST
మైనర్ బాలికపై బంధువుల సామూహిక అత్యాచారం.. దానిని వీడియో తీసి..

సారాంశం

బులాంద్ షాహర్ ప్రాంతానికి చెందిన ఓ 14ఏళ్ల మైనర్ బాలికపై డిసెంబర్ 3వ తేదీన నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దాన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కాగా.. ఆ వీడియో వైరల్ అవ్వడంతో... పోలీసులకు సమాచారం అందింది.

మైనర్ బాలికపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులంతా బాలిక బంధువులే కావడం గమనార్హం. వాళ్లల్లో ఒకరు ఈ ఘటన మొత్తాన్ని వీడియో తీశాడు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బులాంద్ షాహర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. కాగా...  నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... బులాంద్ షాహర్ ప్రాంతానికి చెందిన ఓ 14ఏళ్ల మైనర్ బాలికపై డిసెంబర్ 3వ తేదీన నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దాన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కాగా.. ఆ వీడియో వైరల్ అవ్వడంతో... పోలీసులకు సమాచారం అందింది.

ఆ వీడియో పోలీసులకు చేరడంతో... విచారణ జరిపి కేసు నమోదు చేసుకున్నారు. సమాచారం అందుకున్న రెండు గంటల్లోనే పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేయడం విశేషం. ఈ మేరకు కేసు నమోదు  చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

uttar Pradsh : ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే టాప్... ఏ రాష్ట్రమో తెలుసా?
Jobs : పదో తరగతి పాసైతే చాలు.. ఎగ్జామ్, ఇంటర్వ్యూ ఏది లేకుండానే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్