పరీక్ష రాసినవారందరూ ఫెయిలయ్యారు

Published : May 03, 2019, 09:58 AM IST
పరీక్ష రాసినవారందరూ ఫెయిలయ్యారు

సారాంశం

పరీక్షలన్నాక.. కొందరు విద్యార్థులు ఉత్తీర్ణులౌతారు.. మరికొందరు ఫెయిల్ అవుతుంటారు. ఇది కామన్ జరిగే తంతే. అయితే... ఓ పరీక్ష మాత్రం రాసినవారెవ్వరూ పాస్ కాలేదు.


పరీక్షలన్నాక.. కొందరు విద్యార్థులు ఉత్తీర్ణులౌతారు.. మరికొందరు ఫెయిల్ అవుతుంటారు. ఇది కామన్ జరిగే తంతే. అయితే... ఓ పరీక్ష మాత్రం రాసినవారెవ్వరూ పాస్ కాలేదు. మూడువేల మందికి పైగా పరీక్షకు హాజరవ్వగా... ఒక్కరు కూడా ఉత్తీర్ణత సాధించకపోవడం ఇప్పుడు  చర్చనీయాంశమైంది. ఈ ఘటన తమిళనాడులో జరగగా... జిల్లా న్యాయమూర్తి నియామక పరీక్షలో ఈ వింత చోటుచేసుకుంది.

తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 31 జిల్లా న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయడానికి గాను మద్రాసు హైకోర్టు, తమిళనాడు ప్రభుత్వం సంయుక్తంగా జనవరి 13న పరీక్ష నోటిఫికేషన్‌ను విడుదల చేశాయి. దీనికి 35 ఏళ్ల నుంచి 48 ఏళ్ల మధ్య వయస్సున్న న్యాయవాదులు, అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు (ఏపీపీలు), సివిల్‌ కోర్టుల్లో న్యాయమూర్తులుగా, మెజిస్ట్రేట్లుగా పనిచేస్తున్న పలువురు న్యాయమూర్తులు కలిపి 3,562 మంది దరఖాస్తు చేసుకున్నారు. 

పరీక్షను ప్రిలిమినరీ, మెయిన్, ఇంటర్వ్యూలుగా మూడు దశలుగా విభజించారు. ప్రిలిమినరీ పరీక్షను రెండు పేపర్లుగా ఏప్రిల్‌ 7న నిర్వహించారు. ప్రిలిమ్స్‌ పరీక్షకు మూడు వేల మందికి పైగా హాజరయ్యారు. పరీక్ష ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. అందులో ఏ ఒక్కరు కూడా ఉత్తీర్ణత సాధించలేకపోవడం విశేషం. దీంతో మే 25,26 తేదీల్లో జరగాల్సిన మెయిన్‌ పరీక్షకు ఒక్కరు కూడా అర్హత సాధించలేకపోయారు.
 

PREV
click me!

Recommended Stories

Tamilnadu Incidnt : నిందితుడికి రెండు మరణశిక్షలు | Asianet News Telugu
Coimbatore Child Case: 10 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగితే జోకులేంటి... సస్పెండ్ చేసిన సీఎం విజయ్