తాము పెళ్లిలో మాస్క్ లు ధరించాల్సిన అవసరం లేదని, తాము కుమారుడి పెళ్లి చేయడం ద్వార తప్పు చేయలేదని కుమారస్వామి చెప్పారు.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు, కన్నడ హీరో నిఖిల్ గౌడ లాక్ డౌన్ లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ లో అందరూ తమ శుభకార్యాలను వాయిదా వేసుకుంటూ ఉంటే.. నిఖిల్ మాత్రం పెళ్లి జరగాల్సిందేనని పట్టుపట్టారు. దీంతో.. అతి కొద్ది మంది అతిథుల మధ్య శుక్రవారం నిఖిల్- రేవతిల వివాహం జరిగింది.
వీరి పెళ్లిపై సోషల్ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి. అయితే.. లాక్ డౌన్ లో తమ కుమారుడి పెళ్లి జరగడాన్ని కుమారస్వామి సమర్థించుకున్నారు.కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో పెళ్లికి ముందు తాము అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నామని కుమారస్వామి చెప్పారు.
తాము పెళ్లిలో మాస్క్ లు ధరించాల్సిన అవసరం లేదని, తాము కుమారుడి పెళ్లి చేయడం ద్వార తప్పు చేయలేదని కుమారస్వామి చెప్పారు.
‘‘లక్షలాది మంది కార్యకర్తలు, శ్రేయోభిలాషులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు... ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ఈ ప్రమాదకరమైన పరిస్థితి ముగిసినప్పుడు, మీతో కలిసి కూర్చుని భోజనం చేద్దాం’’ అంటూ హెచ్‌డి కుమారస్వామి రెండు ట్వీట్ లు చేశారు.
పెళ్లి సందర్భంగా సామాజిక దూరం నిబంధనలు పాటించని మాజీ ప్రధాని దేవెగౌడను అరెస్టు చేయాలని కొందరు డిమాండ్ చేయడంపై తాను బాధపడుతున్నానని కుమారస్వామి చెప్పారు.
మాజీ ప్రధాని దేవెగౌడ మనుమడు, జేడీఎస్ అధినేత కుమారస్వామి తనయుడైన హీరో నిఖిల్ వివాహం కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి క్రిష్ణప్ప మనవరాలు రేవతితో రామ్‌నగర్ కేతగానహళ్లిలోని ఫాం హౌస్‌లో జరిగింది. ఈ వివాహానికి దేవెగౌడ కుటుంబసభ్యులు, పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు, అత్యంత సన్నిహితులు హాజరయ్యారు