ripped jeans: చిరిగిన జీన్స్.. ఉత్త‌రాఖండ్ మాజీ సీఎం వివాదాస్ప‌ద‌ వ్యాఖ్య‌లు

By Mahesh RajamoniFirst Published May 16, 2022, 5:08 PM IST
Highlights

Tirath Singh Rawat: జీన్స్ ధరించడం భారతీయ సంస్కృతిలో భాగం కాదంటూ ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయ‌కుడు తీరత్ సింగ్ రావత్ మ‌రోసారి త‌న వ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్థించుకున్నారు.  యాంటీ రిప్డ్ జీన్స్ వైఖరిని రెట్టింపు చేశారు.
 

Former Uttarakhand chief minister : భార‌తీయ జ‌నతా పార్టీ నాయ‌కుడు, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ యాదవ్ చిరిగిన జీన్స్‌పై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చిరిగిన జీన్స్ ధరించడం భారతీయ సంస్కృతిలో భాగం కాదంటూ ఆయ‌న పేర్కొన్నారు. గ‌తేడాది ఆయ‌న జీన్స్ ధ‌రించ‌డంపై చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపిన సంగ‌తి తెలిసిందే. మ‌రోసారి ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్థించుకుంటూ.. యాంటీ రిప్డ్ జీన్స్ వైఖరిని రెట్టింపు  చేస్తూ.. మ‌రో వివాదానికి తెర‌లేపారు. 

వివ‌రాల్లోకెళ్తే.. 2021వ సంవత్సరం మార్చిలో తీరత్ సింగ్ యాదవ్ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా నియమితులైన తర్వాత జీన్స్ ధ‌రించడంపై వివాదాస్పద వ్యాఖ్య‌లు చేశారు. నేటి యువతులు వింత ఫ్యాషన్ ట్రెండ్‌లను అనుసరిస్తారని వ్యాఖ్యానించారు. చిరిగిన జీన్స్,బూట్లు ధరించి ఉన్న ఓ తల్లిని చూసి తాను షాక్ అయ్యానని తీర‌త్ సింగ్ పేర్కొన్నారు. చిరిగిన జీన్స్‌ ఫ్యాషన్‌ని ఆయన ఎగతాళి చేశారు. ఆయ‌న ఒక  ఓడలో ప్ర‌యాణం చేస్తున్న‌ప్పుడు.. చిరిగిన జీన్స్ ధరించి తన ఇద్దరు పిల్లలతో ఒక మహిళ తన పక్కన కూర్చోవడం చూశానని చెప్పాడు. బెహెన్‌జీ ఎక్కడికి వెళ్లాలని నేను ఆమెను అడిగాను, ఆ మహిళ తాను ఢిల్లీకి వెళ్లాలని, ఆమె భర్త జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ యూనివ‌ర్సిటీలో (జేఎన్‌యూ)  ప్రొఫెసర్‌గా ఉన్నారని, ఆమె స్వయంగా ఒక స్వ‌చ్ఛంద సంస్థ‌ను (ఎన్‌జీవో) నడుపుతున్నదని చెప్పార‌ని తీర‌త్ సింగ్ యాద‌వ్ చెప్పారు. 

తిరత్ సింగ్‌ ఇంకా మాట్లాడుతూ.. 'తాను స్వయంగా ఎన్జీవో నడుపుతున్న మహిళ, చిరిగిన జీన్స్ ధరించి, సమాజంలో ఎలాంటి సంస్కృతిని వ్యాప్తి చేస్తుందో నేను అనుకున్నాను. మేము పాఠశాలల్లో చదివినప్పుడు, ఇలాంటి ప‌రిస్థితి లేదు అని అన్నారు. చిరిగిన జీన్స్ ధరించిన మహిళల వల్ల వారి పిల్లలు కూడా వారిని అనుసరిస్తారని పేర్కొన్నారు. త‌ల్లులు ఇంట్లో పిల్లలకు సరైన సంస్కారం నేర్పాలంటూ వ్యాఖ్యానించారు. ఆయ‌న చేసిన ఈ వ్యాఖ్య‌లు తీవ్ర దుమార‌మే రేపాయి.  ఈ వ్యాఖ్యలపై నెటిజన్లతోపాటు రాజకీయ పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.అన్ని వర్గాల నుంచి విమర్శలు ఎదుర్కొన్న యాదవ్ చివరికి క్షమాపణలు చెప్పారు.  ఆయ‌న ముఖ్యంమంత్రి ప‌ద‌విని సైతం కోల్పోవాల్సి వ‌చ్చింది. మార్చి 2021లో రాజకీయ పరిణామాల మధ్య త్రివేంద్ర సింగ్ రావత్ తర్వాత, తిరత్ సింగ్ రావత్‌ను బీజేపీ సీఎంను చేసింది. కానీ ఆయన చేసిన ప్రకటనల కారణంగా వార్తల్లో నిలిచిన తీరత్ సింగ్ రావత్ ను కొద్ది నెలల్లోనే తొలగించి పుష్కర్ సింగ్ ధామిని సీఎం చేశారు.

ఈ నేప‌థ్యంలోనే మ‌రోసారి తీర‌త్ సింగ్ యాద‌వ్ జీన్స్ ధ‌రించ‌డంపై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. రిప్డ్ జీన్స్ గురించి ప్రస్తావించి మరోసారి చర్చను వేడెక్కించారు. తన పర్యటనలో మాజీ సీఎం తీరత్ రావత్ ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఈ విషయాన్ని ప్రస్తావించారు. రిప్డ్ జీన్స్ మన సంస్కృతికి, సంప్ర‌దాయానికి, క్రమశిక్షణకు సంకేతం కాదన్నారు. ఈ అంశంపై తాను గతంలో చేసిన ప్రకటనలకు కట్టుబడి ఉన్నానని యాదవ్ చెప్పారు.
 

click me!