ఉత్తర భారత్ పెరియార్.. అంబేద్కర్: తమిళనాడు సీఎం స్టాలిన్.. పీఎం మోడీ ఏమన్నారంటే?

By Mahesh KFirst Published Dec 6, 2022, 6:30 PM IST
Highlights

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణాదిన సెక్యులరిజం కోసం పోరాడిన పెరియార్.. అంబేద్కరుడు అని తెలిపారు. ఆయన ఆధునిక బుద్ధుడు అని కూడా పేర్కొన్నారు.
 

చెన్నై: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఈ రోజు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ.. ఉత్తరాది ప్రజల పెరియార్.. అంబేద్కరుడు అని వ్యాఖ్యానించారు. ఉత్తర భారత దేశంలో సెక్యులరిజం కోసం పోరాడిన అంబేద్కర్.. అక్కడి ప్రజలకు పెరియార్ వంటివారని వివరించారు.

అణగారిన వర్గాల బానిసత్వ సంకెళ్లను తెంచిన నేత అంబేద్కర్ అని సీఎం స్టాలిన్ ట్వీట్ చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆధునిక బుద్ధుడు అని వివరించారు. అణచివేత, డామినెన్స్ లేని సమసమాజం కోసం పోరాడారని తెలిపారు.

మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే అంతర్జాతీయ స్థాయి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మెమోరియల్ నిర్మిస్తామని, ముంబయిలోని ఇందు మిల్ కంపౌండ్‌లో వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని అన్నారు.

Also Read: కారణమిదీ:ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద వీహెచ్ మౌన దీక్ష

భారత రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ జయంతిని మహాపరినిర్వాణ్ దినంగా పాటిస్తారు. మహాపరినిర్వాణ్ దినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ట్వీట్ చేశారు. మహాపరినిర్వాణ్ రోజు సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌కు నివాళి అర్పిస్తున్నట్టు పేర్కొన్నారు. దేశానికి ఆయన చేసిన గొప్ప సేవను మననం చేసుకుంటానని వివరించారు. ఆయన పోరాటం లక్షలాది మందికి భరోసా ఇచ్చిందని, భారత దేశానికి ఆయన విశాల రాజ్యాంగాన్ని అందించడానికి ఆయన చేసిన కృషి మరువలేనిదని ట్వీట్ చేశారు.

click me!