చలిగుప్పిట్లో ఉత్తర భారతం.. ఢిల్లీలో 3 డిగ్రీల ఉష్ణోగ్రత.. గడిచిన రెండేళ్లలో ఇదే అత్యల్పం..

By team teluguFirst Published Jan 6, 2023, 10:05 AM IST
Highlights

దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఆయా రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు కప్పేస్తోంది. దీని వల్ల ప్రయాణాలకు ఆటంకం కలుగుతోంది. 

ఉత్తర భారతదేశం చలితో వణికిపోతుంది. తీవ్రమైన చలిగాలులు, దట్టమైన పొగమంచు ఢిల్లీతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాలను కప్పేస్తోంది. దీని వల్ల రైల్వే, రోడ్డు ప్రయాణాలపై తీవ్ర ప్రభావం పడుతోందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శుక్రవారం తెలిపింది. అయితే గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో మూడు డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గడిచిన రెండు సంవత్సరాల్లో జనవరి సమయంలో ఇంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కాలేదు. దీంతో ఢిల్లీ వాసులు చలితో వణికిపోయారు. 

నైట్ డ్యూటీ నుంచి వస్తున్న మహిళా పోలీసును వెంబడించి, వేధింపులు.. ముగ్గురు అరెస్ట్‌

హిమాలయాల నుండి మంచుతో కూడిన గాలులు దేశ రాజధానితో పాటు ఉత్తర భారతంలోని మైదాన ప్రాంతాలపై వీస్తున్నాయి. దీంతో ప్రజలు తమను తాము వెచ్చగా ఉంచుకోవడానికి స్పేస్ హీటర్‌లు, వేడి పానీయాల వైపు మొగ్గు చూపుతున్నారు. గురువారం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా.. డల్హౌసీ లో 4.9 డిగ్రీలు, ధర్మశాలలో 5.2 డిగ్రీలు, కాంగ్రాలో 3.2 డిగ్రీలు, సిమ్లాలో 3.7 డిగ్రీలు, డెహ్రాడూన్ లో 4.6 డిగ్రీలు, ముస్సోరీలో 4.4 డిగ్రీలు, నైనిటాల్ లో 6.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.

Delhi | People light up bonfires to find respite from the prevailing cold wave and fog conditions in the national capital. Visuals from the Nizamuddin area pic.twitter.com/rMOU0R6Dbk

— ANI (@ANI)

జమ్మూ, కాశ్మీర్‌లో కూడా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. రాజధాని శ్రీనగర్‌లో ఇంతకు ముందు గురువారం రాత్రి - 5.2 డిగ్రీల సెల్సియస్‌ నమోదు కాగా.. బుధవారం రాత్రి - 6.4 డిగ్రీల సెల్సియస్ నమోదు అయ్యింది. ఈ సీజన్ లో ఇదే అత్యంత చలిగా రికార్డుల్లోకి ఎక్కింది. ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకున్నదని, రానున్న వారాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది.

पंजाब: बठिंडा शहर में घना कोहरे और शीत लहर के कारण लोगों को काफी परेशानी का सामना करना पड़ रहा है।

एक स्थानीय ने बताया, "बठिंडा में काफी कोहरा है। एक व्यक्ति को दूसरा व्यक्ति नहीं दिख रहा है। कहीं आने-जाने में काफी दिक्कत हो रही है।" (05.01) pic.twitter.com/rmkTPHOMz0

— ANI_HindiNews (@AHindinews)

పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 2.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. బటిండాలో 3 డిగ్రీల సెల్సియస్, లూథియానాలో 5.7 డిగ్రీల సెల్సియస్, పాటియాలాలో 5 డిగ్రీల సెల్సియస్, అమృత్‌సర్‌లో 5.5 డిగ్రీల సెల్సియస్, మొహాలీలో 6 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

పాకిస్థాన్‌తో సంబంధాలున్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్‌పై కేంద్రం వేటు..

హర్యానాలోని హిసార్‌లో చలి విపరీతంగా ఉంది. ఇక్కడ కనిష్ట ఉష్ణోగ్రత 2.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. భివానీలో 6.7 డిగ్రీల సెల్సియస్, కర్నాల్‌లో 6 డిగ్రీల సెల్సియస్, రోహ్‌తక్‌లో 5.4 డిగ్రీల సెల్సియస్, సిర్సాలో 6.4 డిగ్రీల సెల్సియస్, అంబాలాలో కనిష్ట ఉష్ణోగ్రత 5.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. రెండు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని చండీగఢ్‌లో అత్యల్పంగా 5.1 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది.

click me!