‘పఠాన్’కు వ్యతిరేకంగా ఆగని నిరసనలు.. పూణెలో పోస్టర్లు తొలగించి భజరంగ్ దళ్ కార్యకర్తల ఆందోళనలు..

By team teluguFirst Published Jan 23, 2023, 3:55 PM IST
Highlights

పఠాన్ సినిమా విడుదలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ పూణేలో భజరంగ్ దళ్ కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. శివజీనగర్‌లోని రాహుల్ సినిమా థియేటర్ వద్ద అభిమానులు ఉంచిన పఠాన్ పోస్టర్‌ భజరంగ్ దళ్ సభ్యులు తొలగించారు.

పఠాన్ సినిమాకు వ్యతిరేకంగా నిరసనలు ఆగడం లేదు. ఆ సినిమాను నిలిపివేయాలని కోరుతూ దేశంలోని పలు ప్రాంతాలో ఆందోళన వ్యక్తమవుతున్నాయి. గౌహతి, కర్ణాటక, గుజరాత్‌లలో ఇటీవల భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. తాజాగా మహారాష్ట్రలోని పూణేలో కూడా ఆ రైట్ వింగ్ కార్యకర్తలు నిరసన తెలిపారు. ఈ నిరసనల్లో భాగంగా పూణేలోని శివజీనగర్‌లోని రాహుల్ సినిమా థియేటర్ వద్ద అభిమానులు ఉంచిన పఠాన్ పోస్టర్‌ భజరంగ్ దళ్ సభ్యులు తొలగించారు.

జమ్మూలో ఉగ్రముప్పు మధ్య కొన‌సాగుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర‌.. సాంబాలో ఘ‌న స్వాగ‌తం

బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా విడుదలను నిలిపివేయాలని కోరుతూ కొంత కాలం నుంచి భజరంగ్ దళ్, ఇతర రైట్ వింగ్ సంఘాలు నిరసనలు చేపడుతున్నాయి. గత శుక్రవారం గౌహతిలోని గోల్డ్ డిజిటల్ సినిమా హాల్ ముందు బజరంగ్ దళ్ కార్యకర్తలు గుమిగూడారు. అక్కడ పఠాన్ పోస్టర్లను ధ్వంసం చేసి, తగులబెట్టారు. జై శ్రీ రామ్ అంటూ నినాదాలు చేశారు. కాగా.. ఈ ఘటనపై స్పందన ఏంటని అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మను ప్రశ్నించినప్పుడు ‘‘షారుఖ్ ఖాన్ ఎవరు?’’ అని ప్రశ్నించారు.

కర్ణాటక హిజాబ్ నిషేధం కేసు విచార‌ణ‌కు ముగ్గురు న్యాయ‌మూర్తుల‌తో సుప్రీంకోర్టు బెంచ్

‘‘ ఈ ఘటనపై ఎవరైనా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం.. ఈ పఠాన్-వథాన్ అంటే ఏంటో నాకు తెలియదు.. నేను వినలేదు, చూడలేదు’’ అని చెప్పారు. ‘‘ దీనికి సమయం లేదు … షారుఖ్ ఖాన్ ఎవరు? దాని గురించి మనం ఎందుకు చింతించాలి, ఇక్కడ చాలా మంది షారూఖ్ ఖాన్‌లు ఉన్నారు. ‘డా. బెజ్‌బరువా’(రాబోయే అస్సామీ చిత్రం) విడుదల అవుతుంది. దాని గురించి మనం కూడా ఆందోళన చెందవచ్చు. సినిమా తీసిన వాళ్ళు కూడా ఏమీ అనలేదు. అందరి ఫోన్ కాల్స్ నేను తీసుకుంటాను. మనం ఎందుకు కంగారుపడాలి? ఏదైనా సమస్య వస్తే షారుఖ్ ఖాన్ కు ఉంటుంది’’ అని ఆయన అన్నారు. 

మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే కొత్త కూటమి.. బీఆర్ అంబేద్కర్ మనవడి పార్టీతో అలయెన్స్.. కాంగ్రెస్, ఎన్సీపీ కూడానా?

అయితే ‘‘షారుఖ్ ఖాన్ ఎవరు?’’ అని పేర్కొన్న కొన్ని గంటల తరువాత తాను షారుఖ్ ఖాన్ తో మాట్లాడానని హిమంత బిస్వా శర్మ వెల్లడించారు. అలాంటి ఘటన పునరావృతం కాకుండా ప్రభుత్వం భరోసా ఇస్తుందని ఆయనకు తాను హామీ ఇచ్చానని చెప్పారు. షారుక్ ఖాన్, దీపికా పదుకునే నటించి, సిద్ధార్థ్ ఆనంద్ హెల్మ్ నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరుగులు పెట్టేందుకు సిద్దంగా ఉంది. ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఇప్పటి వరకు దాదాపు 14 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమాలో జాన్ అబ్రహం కూడా కీలక పాత్రల్లో నటించారు. 

click me!