గంగానదిలో చేతులు కడుక్కోవడానికి దిగి.. ఇద్దరు బీపీఓ సెంటర్ ఉద్యోగులు గల్లంతు.. !

By AN TeluguFirst Published Sep 6, 2021, 9:20 AM IST
Highlights

రాహుల్ చేతులు కడుక్కోవడానికి నదిలోకి దిగాడు. చేతులు కడుక్కుంటున్న సమయంలో బ్యాలెన్స్ తప్పి.. నదిలోకి జారి, కొట్టుకుపోయాడు. అతను కొట్టుకుపోతుండడం చూసిన భాను అతడిని రక్షించడానికి నదిలోకి దూకాడు. అయితే ప్రవాహం ఉదృతంగా ఉండడం వల్ల ఇద్దరూ కొట్టుకుపోయారు

డెహ్రాడూన్ : నోయిడాకు చెందిన ఇద్దరు సీనియర్ ఉద్యోగులు ఆదివారం రిషికేశ్‌లోని గంగా నదిలో కొట్టుకుపోయారు. ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటనలో వీరి ఆచూకీ ఇంకా దొరకకపోవడంతో.. చనిపోయి ఉంటారని భావిస్తున్నారు.

నోయిడాలోని అడ్రాయిట్ సినర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ సెంటర్ హెడ్ రాహుల్ సింగ్ (33),  మేనేజర్ భాను మూర్తి (33) లు వీకెండ్ లో మరో ఏడుగురితో కలిసి రుషికేష్ ట్రిప్ కు వచ్చారు. "ఈ బృందం ఆదివారం ఉదయం రిషికేష్ చేరుకుంది. తపోవన్ లోని ఒక హోటల్‌ లో బస చేసింది. వారంతా కలిసి సిటీవైపు నడుస్తుండగా రామ్ ఝులా సమీపంలో ప్రమాదం జరిగింది ”అని ముని కీ రేతి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కమల్ మోహన్ సింగ్ భండారి అన్నారు.

రాహుల్ చేతులు కడుక్కోవడానికి నదిలోకి దిగాడు. చేతులు కడుక్కుంటున్న సమయంలో బ్యాలెన్స్ తప్పి.. నదిలోకి జారి, కొట్టుకుపోయాడు. అతను కొట్టుకుపోతుండడం చూసిన భాను అతడిని రక్షించడానికి నదిలోకి దూకాడు. అయితే ప్రవాహం ఉదృతంగా ఉండడం వల్ల ఇద్దరూ కొట్టుకుపోయారు”అని వారితో పాటు ట్రిప్ కి వచ్చి వారి సహోద్యోగి సునీల్ కుమార్ చెప్పారు. 

అయితే, వీరిద్దరికీ "ఈత కొట్టడం రాదు" అని కూడా ఆయన అన్నారు. బులంద్‌షహర్‌కు చెందిన రాహుల్.. భార్య, ఇద్దరు పిల్లలతో నోయిడాలో నివసిస్తున్నాడు. కాగా, భాను ఢిల్లీకి చెందినవాడు. వీరిద్దరూ కనిపించికుండా పోవడంతో వెంటనే వీరు  పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. 

తప్పిపోయిన వ్యక్తుల కోసం స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) బృందం మోటార్ రాఫ్ట్ లతో వెతుకుతోంది.  "ఆదివారం సాయంత్రం వరకు సెర్చ్ ఆపరేషన్ కొనసాగింది" అని ఒక ఎస్ డిఆర్ఎఫ్ అధికారి చెప్పారు. "వర్షాకాలం కారణంగా గంగా నీటి మట్టం ఎక్కుగా ఉంది. ప్రవాహ ఉదృతి కూడా బలమైన ప్రమాద స్థాయికి దగ్గరగా ఉంది. ఈ సమయంలో నీళ్లలోకి దిగడం చాలా ప్రమాదకరం." అని వారు తెలిపారు.

గత నెలలో, ముంబైకి చెందిన ముగ్గురు విద్యార్థులు హరిద్వార్ దగ్గర గంగా స్నానం చేస్తుండగా మునిగిపోయారు. ముందు వీరిలో ఒకరు నీటిలో మునిగిపోయి.. జారిపోయింది. దీంతో మిగిలిన ఇద్దరు ఆమెను రక్షించడానికి ఆమె వైపు ఈదుకుంటూ వెళ్లారు. దీంతో ముగ్గురూ నీటిలో కొట్టుకుపోయి, చనిపోయారు. 
 

click me!