సహజీవనం...బీరులో విషం కలిపి లవర్ కి తాగించిన యువతి

By ramya neerukondaFirst Published 12, Sep 2018, 10:24 AM IST
Highlights

రాత్రివేళ ప్రియురాలైన యువతి తన ప్రియుడైన అన్షుల్ కు విషం కలిపిన బీరు తాగించి పరారైంది. విషం కలిపిన బీరు తాగిన అన్షుల్ మరణించాడు.

ఇద్దరు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. ఇద్దరూ కలిసి కొన్ని నెలలుగా సహజీవనం కూడా చేశారు. ఎమైందో ఏమో తెలీదు.. ఒక రోజు సెడన్ గా.. ఆ యువకుడు శవమై కనిపించాడు. అతని ప్రియురాలే.. విషయం ఇచ్చి చంపినట్లు పోలీసులు తేల్చారు. ఈ సంఘటన నోయిడాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. నోయిడాలోని సెక్టార్ 15 మెట్రోస్టేషను వద్ద ఉన్న ఓ గదిలో 21 ఏళ్ల అన్షుల్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అన్షుల్ ఇటావా జిల్లాకు చెందిన యువకుడిగా పోలీసులు గుర్తించారు. అన్షుల్ ఓ గాళ్ ఫ్రెండ్ తో కలిసి హరోల్లా గ్రామంలోని అద్దె ఇంట్లో నివాసముండేవాడు. రాత్రివేళ ప్రియురాలైన యువతి తన ప్రియుడైన అన్షుల్ కు విషం కలిపిన బీరు తాగించి పరారైంది. విషం కలిపిన బీరు తాగిన అన్షుల్ మరణించాడు.

 పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసుకొని హంతకి అయిన ప్రియురాలి కోసం గాలిస్తున్నారు. అయితే.. అసలు ఆమె ఎందుకు చంపింది అనే విషయం మాత్రం తెలియరాలేదు. పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

Last Updated 19, Sep 2018, 9:23 AM IST