10 వేల పట్టుచీర రూ.4.500కే.. సర్కార్ వినాయక చవితి ఆఫర్

By sivanagaprasad KodatiFirst Published 12, Sep 2018, 10:05 AM IST
Highlights

మైసూర్ సిల్క్ చీర అంటే మహిళలకు ఎంత మోజో ప్రత్యేకంగా చెప్కనక్కర్లేదు. పండుగల సమయంలో దీనికి మరింత డిమాండ్ ఉంటుంది. అయితే దీని ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండవు.

మైసూర్ సిల్క్ చీర అంటే మహిళలకు ఎంత మోజో ప్రత్యేకంగా చెప్కనక్కర్లేదు. పండుగల సమయంలో దీనికి మరింత డిమాండ్ ఉంటుంది. అయితే దీని ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండవు. ఈ నేపథ్యంలో వినాయక చవితిని పురస్కరించుకుని కర్ణాటక ప్రభుత్వం మహిళలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.

పదివేల రూపాయల విలువ గల మైసూర్ సిల్క్ చీరను డిస్కౌంట్ కింద నాలుగున్నర వేలకే విక్రయిస్తున్నట్లు తెలిపింది. దీంతో మైసూర్ నగరంలోని కర్ణాటక సిల్క్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఔట్‌లెట్‌ ముందు మహిళలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. ఉదయం ఐదు గంటల నుంచే మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో కిలోమీటర్ల మేర నిలబడ్డారు.

అయితే డిస్కౌంట్‌పై చీరలు కావాల్సిన వారు వెబ్‌సైట్‌లో తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలని చెప్పి క్యూలో ఉన్నవారికి విక్రయిస్తున్నారని మహిళలు ఆరోపించారు. మరోవైపు ఆధార్ కార్డ్‌తో వచ్చిన వారికే చీరలు ఇస్తామని అధికారులు తెలిపారు..

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి చేతుల మీదుగా డిస్కౌంట్‌పై  చీరల విక్రయాన్ని ప్రారంభిస్తామన్నారు.. ఉదయం పదిగంటలకు స్టోర్ తెరవనుండగా..తెల్లవారు జాముకే మహిళలు పెద్ద సంఖ్యలో రోడ్డుపై బారులు తీరడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. 

Last Updated 19, Sep 2018, 9:23 AM IST