ఉచిత విద్య‌.. ఉచిత నీరు అందించ‌డం నేర‌మా? : ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్

Published : Aug 08, 2022, 08:00 PM IST
ఉచిత విద్య‌.. ఉచిత నీరు అందించ‌డం నేర‌మా? :  ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్

సారాంశం

Arvind Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం నాడు మీడియాతో మాట్లాడుతూ.. ఉచిత విద్య, విద్యుత్, నీటి కోసం తమ పార్టీ చేస్తున్న ప్రచారంపై విమర్శలకు దిగారు. ఉచిత విద్య, నీరు, విద్యుత్ అందించడం నేరామా? దేశంలోని ధనికులు కొందరికి కోట్లాది రూపాయల రుణాలు ఎలా మాఫీ అవుతున్నాయని ఎవరూ మాట్లాడడం లేదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్య, ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచిత చికిత్స, ఉచిత విద్యుత్, పన్ను లేని నీరు అందించడం నేరమనే వాతావరణం సృష్టించబడుతుందని అన్నారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలు జరుపుకుంటున్న దేశంలో నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం, 300 యూనిట్ల విద్యుత్, నిరుద్యోగ భృతి అందించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. "మేము దేశానికి స్వాతంత్య్ర  75 వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అటువంటి సౌకర్యాలను బలోపేతం చేయడానికి మేము ప్రణాళిక వేయాలి. కానీ మేము వాటికి వ్యతిరేకంగా వాతావరణాన్ని సృష్టిస్తున్నాము" అని ఆయన అన్నారు. అలాంటి వాటిని వ్యతిరేకించే వారిని ద్రోహులు అని పిలవాలి అని అన్నారు. “వారు (బీజేపీ) కొంతమంది వ్యక్తుల ₹ 10 లక్షల కోట్ల రుణాన్ని మాఫీ చేశారు. వీరిలో కొందరు స్నేహితులు కూడా ఉన్నట్లు సమాచారం. దాని గురించి ఎవరూ మాట్లాడటం లేదు. అలాంటి వారిని దేశద్రోహులుగా అభివర్ణించి, వారిపై విచారణ జరపాలి’’ అని ఢిల్లీ సీఎం అన్నారు. గత నెలలో, ప్రధాని నరేంద్ర మోడీ ఓట్ల కోసం ఉచితాలను అందించే "రేవారీ సంస్కృతి" అని పిలిచే దానికి వ్యతిరేకంగా ప్రజలను హెచ్చరించాడు.  ఇటువంటి పద్ధతులు దేశ అభివృద్ధికి చాలా ప్రమాదకరమైనవి అని పేర్కొన్నారు. అంతకుముందు, గుజరాత్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు భారతీయ జనతా పార్టీ (బీజేపీ), ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మధ్య ప్రత్యక్ష పోటీ అని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ దాని ఔచిత్యాన్ని కోల్పోయిందనీ, దానికి ఓటు వేయడం వల్ల ప్రయోజనం లేదని  తెలిపారు. రానున్న ఎన్నిక‌ల‌కు ముందే ఆ పార్టీ నాయకులు అధికార బీజేపీలో చేరడంతో ముగుస్తుందని పేర్కొన్నారు. బొటాడ్, అహ్మదాబాద్ జిల్లాల్లో ఇటీవల జరిగిన హూచ్ విషాదంలో ఇప్పటివరకు 43 మంది మరణించారనీ, గుజ‌రాత్ లో మ‌ద్యం నిషేధం చట్టం ఉన్నప్పటికీ బహిరంగంగా మద్యం అమ్ముతున్నారని చెప్పారు. ఈ క్ర‌మంలోనే బీజేపీపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. బీజేపీ అంటేనే అవినీతి, కల్తీ మద్యం అంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల‌ను ప్ర‌స్తావిస్తూ..  "ఈ ఎన్నిక‌ల్లో ఆప్, బీజేపీ మధ్య పోటీ. AAP అంటే కొత్త రాజకీయాలు, కొత్త ముఖాలు, కొత్త ఆలోచనలు, ఉత్సాహం, శక్తి మొదలైనవాటితో నిజాయితీ, దేశభక్తి ఉన్న పార్టీ అని అర్థం. బీజేపీ అంటే నకిలీ మద్యం, అవినీతి అని ఛోటా ఉదయ్‌పూర్ జిల్లాలోని బోడెలిలో జరిగిన సభలో కేజ్రీవాల్ అన్నారు. అలాగే, కాంగ్రెస్ పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు.

free education: ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ ఉచిత విద్య, ఉచిత విద్యుత్, ఉచిత నీరు ఇవ్వడం నేరమనే వాతావరణం సృష్టించబడుతోందని పేర్కొన్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Tata Nexon : కేవలం 30K సాలరీ ఉన్న చిరుద్యోగులు కూడా... ఈ కారును మెయింటేన్ చేయవచ్చు
Gleeden App: ఇదేం క‌ర్మ దేవుడా.. వివాహేత‌ర సంబంధాల కోసం కూడా యాప్‌. మ‌హిళ‌లే టాప్