సంతాన సామర్ధ్యం దెబ్బతినదు.. పాలిచ్చే తల్లులకూ సురక్షితమే: వ్యాక్సిన్ అపోహలపై కేంద్రం క్లారిటీ

Siva Kodati |  
Published : Jun 30, 2021, 07:49 PM IST
సంతాన సామర్ధ్యం దెబ్బతినదు.. పాలిచ్చే తల్లులకూ సురక్షితమే: వ్యాక్సిన్ అపోహలపై కేంద్రం క్లారిటీ

సారాంశం

కరోనా టీకాకు సంబంధించి ప్రజల్లో ఇంకా అనుమానాలు, అపోహలు తొలగడం లేదు. దీంతో వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, సెలబ్రెటీలు ఎంతగా అవగాహన కల్పించినా కొందరు టీకా కేంద్రాల వైపు కన్నెత్తి చూడటం లేదు

కరోనా టీకాకు సంబంధించి ప్రజల్లో ఇంకా అనుమానాలు, అపోహలు తొలగడం లేదు. దీంతో వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, సెలబ్రెటీలు ఎంతగా అవగాహన కల్పించినా కొందరు టీకా కేంద్రాల వైపు కన్నెత్తి చూడటం లేదు. మొన్నామధ్య ఓ వ్యక్తి తనకు, తన భార్యకు టీకాలు వేయొద్దంటూ చెట్టెక్కి కూర్చొన్న ఘటన వైరల్ అయ్యింది. 

అయితే వ్యాక్సిన్ వేయించుకున్నవారిలో సంతాన సాఫల్యతకు సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశముందంటూ పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇక అన్నింటికంటే ముఖ్యంగా పాలిచ్చే తల్లులు టీకాలు వేసుకోవడంపైనా అనేక భయాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్లపై అపోహలను తొలగించేందుకు కేంద్ర ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగింది. దీనిలో భాగంగా మంగళవారం మార్గదర్శకాలను విడుదల చేసింది. 

Also Read:భారత్‌లో అందుబాటులోకి నాలుగో వ్యాక్సిన్... మోడెర్నా టీకాకు డీసీజీఐ అనుమతి

ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న ఏ వ్యాక్సిన్‌ వేయించుకున్నా సంతాన సాఫల్యతపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపించదని స్పష్టం చేసింది. అందుకే టీకాలను తొలుత జంతువులపై ప్రయోగించి... ఆ తర్వాత మనుషులపై ప్రయోగాలు చేపడతారని కేంద్రం తెలిపింది. భద్రత, సమర్థతను పరిశీలించిన తర్వాతే అత్యవసర వినియోగానికి వ్యాక్సిన్లను ఆమోదిస్తారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా టీకాలతో పురుషులు, మహిళల్లో సంతానలేమి ముప్పు ఉందని చెప్పేందుకు ఎలాటి శాస్త్రీయపరమైన ఆధారాలు లేవు అని వివరించింది.

అలాగే పాలిచ్చే తల్లలకూ కొవిడ్‌ వ్యాక్సిన్‌ సురక్షితమేనని జాతీయ నిపుణుల బృందం తెలిపిన విషయాన్ని ఆరోగ్య శాఖ గుర్తుచేసింది. అందువల్ల బాలింతలు వ్యాక్సినేషన్‌కు ముందు, తర్వాత కూడా పిల్లలకు చనుబాలు ఇవ్వొచ్చని, ఆపాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. 

PREV
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !