వాట్సప్ చూస్తోందని.. చెల్లిని కత్తితో పొడిచి చంపిన అన్న.. !!

Published : Jun 30, 2021, 03:56 PM IST
వాట్సప్ చూస్తోందని.. చెల్లిని కత్తితో పొడిచి చంపిన అన్న.. !!

సారాంశం

తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా వాసవంపురంలో దారుణం చోటు చేసుకుంది. మాట వినడం లేదన్న కోపంతో చెల్లిని హత్య చేశాడో యువకుడు. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా వాసవప్పపురంలో ఈ దుర్ఘటన జరిగింది. 

తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా వాసవంపురంలో దారుణం చోటు చేసుకుంది. మాట వినడం లేదన్న కోపంతో చెల్లిని హత్య చేశాడో యువకుడు. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా వాసవప్పపురంలో ఈ దుర్ఘటన జరిగింది. 

స్థానికంగా నివాసం ఉండే సుదాలియాకు మలైరాజా వాట్సాప్ వీడియోలు చూస్తోందని చెల్లిని కత్తితో పొడిచి చంపాడు. వివరాల్లోకి వెడితే.. మలైరాజా అనే వ్యక్తి తన చెల్లి కవితకు ఆన్ లైన్ క్లాసుల కోసం సెల్ ఫోన్ కొనిచ్చాడు. అయితే వాట్సాప్, ఫేస్ బుక్ చూస్తూ.. గేమ్స్ ఆడుతూ కవిత క్లాసులు వినకుండా.. సెల్ ఫోన్ లో వీడియోలు చూస్తూ ఉంటుంది. 

ఈ విషయం మలైరాజా పలుమార్లు చెల్లిని హెచ్చరించాడు. దీనిమీద వారిద్దరి మధ్య వాగ్వాదం కూడా జరిగింది. అయితే ఎంత చెప్పినా వినకుండా వీడియోలు చూస్తోందని, కవితను అన్న మలైరాజా వెనుక నుంచి కత్తితో పొడిచి చంపాడు. దీంతో తీవ్రగాయాలపాలైన కవిత మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Illegal Liquor: సీజ్ చేసిన మద్యాన్నిగుజరాత్ పోలీస్ లు ఏం చేస్తున్నారో చూడండి | Asianet News Telugu
NEET Exam Paper Leak: నీట్ రీ-ఎగ్జామ్ పేప‌ర్ మ‌ళ్లీ లీక్ అయ్యిందా.? క్లారిటీ ఇచ్చిన కేంద్రం