Karnataka: మతాచారాలు ఆచరించేందుకు విద్యాసంస్థ‌ల‌కు రాకూడ‌దు: హిజాబ్ పై కర్ణాటక రాష్ట్ర హోంశాఖ సంచల‌న నిర్ణ‌యం

Published : Feb 04, 2022, 01:40 PM IST
Karnataka: మతాచారాలు ఆచరించేందుకు విద్యాసంస్థ‌ల‌కు రాకూడ‌దు: హిజాబ్ పై కర్ణాటక రాష్ట్ర హోంశాఖ సంచల‌న నిర్ణ‌యం

సారాంశం

Karnataka: విద్యాసంస్థ‌ల్లో ఎవరూ కూడా హిజాబ్ లేదా కాషాయం కండువాలు ధరించకూడదనీ, విద్యార్థులు మతాచారాలు ఆచరించేందుకు పాఠశాలలకు రావద్దని, మన మతాలను అనుసరించడానికి, మనకు ప్రార్థనా స్థలాలు ఉన్నాయనీ, అక్క‌డ న‌చ్చిన ఆచారాన్ని పాటించ‌వ‌చ్చ‌ని కర్ణాటక రాష్ట్ర హోంశాఖ అరగ జ్ఞానేంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు.   

Karnataka: పాఠశాలలు, కళాశాలల్లో ముస్లీం విద్యార్థులు హిజాబ్ ధరించడం, హిందు విద్యార్థులు కాష‌య రంగు చున్నీని ధ‌రించ‌డంపై  కర్ణాటక రాష్ట్ర హోంశాఖ మంత్రి అరగ జ్ఞానేంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులు మతాచారాలు ఆచరించేందుకు పాఠశాలలకు రావద్దని, మన మతాలను అనుసరించడానికి, మనకు ప్రార్థనా స్థలాలు ఉన్నాయనీ, అక్క‌డ న‌చ్చిన ఆచారాన్ని పాటించ‌వ‌చ్చ‌ని తెలిపారు. ఇక నుంచి   పాఠశాల, క‌ళాశాల విద్యార్థులు హిజాబ్, కాషాయం  చున్నీలు ధరించకూడదని మంత్రి సూచించారు. ఈ చ‌ర్య‌లు దేశ‌స‌మైక్య‌త‌ను దెబ్బ తీస్తున్నాయని అన్నారు. 

దేశ సమైక్యతను దెబ్బతీసేందుకు యత్నిస్తున్న మత సంస్థలపై నిఘా వేయాలని మంత్రి పోలీసులను ఆదేశించారు. విద్యాల‌యాలంటే.. విద్యార్థులందరూ చదువుకునే ప్రాంతమని, మతాన్ని ఆచరించేందుకు ఎవరూ పాఠశాలకు రావద్దని మంత్రి కోరారు. అంద‌రూ కూడా ఒకే విధ‌మైన యూనిఫాంను ధ‌రించాల‌నీ, ఇలా చేయ‌డం వల్ల‌.. పిల్లలు తమ విభేదాలను మరచిపోయి.. వారంద‌రూ భారతీయులుగా ఏకం కావడానికి దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులను హిజాబ్ ధరించకుండా పరిమితం చేయడం గురించి కాదు.. హిందూ విద్యార్థులు కాషాయ చున్నీని కూడా ధరించకూడదనీ.. విద్యార్థులు పాఠశాల నిర్దేశించిన నిబంధనలను పాటించాలని సూచించారు. 

కర్ణాటకను కుదిపేస్తున్న హిజాబ్ వివాదంపై సాంఘిక సంక్షేమ శాఖ, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి కోట శ్రీనివాస్ పూజారి కూడా ప్రకటనలు విడుదల చేశారు. హిజాబ్ పేరుతో ఉదాసీనత సృష్టించడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారో? త‌న‌కు తెలియదు. విద్యా వ్యవస్థ కోసం ప్రభుత్వం రూపొందించిన నియమావళి ఉంద‌నీ, దానిని అనుసరించడం విద్యార్థుల విధి. సమాజంలో ఇలాంటి 
అలజడి సృష్టించడం స‌రైన ప‌ద్ద‌తి కాద‌ని అన్నారు. ఈ అంశంపై కర్ణాటక ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేసిందని, ప్రభుత్వ పాఠశాలల్లో కొన్ని నిబంధనలను పాటించాలని, దానిని పాటించడం విధిగా ఉంటుందని ప్రభుత్వం పేర్కొందని తెలిపారు. 

ఉడిపిలోని ప్రభుత్వ ప్రీ-యూనివర్శిటీ కళాశాలలో కొందరు విద్యార్థులు ‘హిజాబ్’ ధరించడంపై వివాదం నెలకొంది. హిజాబ్ ధరించి కళాశాలకు వచ్చిన కుందాపూర్ పీయూ కళాశాలకు చెందిన ముస్లిం విద్యార్థినులను ప్రిన్సిపాల్ గేటు వద్ద అడ్డుకున్నారు. క్లాసుల్లో హిజాబ్ ధరించడానికి అనుమతి లేదని, క్లాసుల్లోకి వెళ్లే ముందు హిజాబ్ తొలగించాలని కోరారు. ఈ నిరసనలు  రాష్ట్ర‌వ్యాప్త‌మ‌య్యాయి. ఈ క్ర‌మంలో హిజాబ్‌లు ధ‌రించ‌డానికి వ్య‌తిరేఖంగా  సుమారు 100 మంది హిందూ విద్యార్థులు కాషాయ శాలువాలు ధరించి క్లాసుల‌కు హాజ‌ర‌య్యారు. దీంతో విద్యాసంస్థల్లో ఉద్రిక్త‌త వాతావ‌రణం నెల‌కొంది.

ఈ విష‌యంపై హోంమంత్రి స్పందిస్తూ..  ప్రజలు స్వేచ్ఛగా తమ మతాన్ని ఆచరించడానికి, ప్రార్థనలు చేసుకోవడానికి చర్చిలు, మసీదులు, దేవాలయాలు ఉన్నాయని, పాఠశాలల్లో జాతీయ సమైక్యత సమగ్రతను పెంపొందించే సంస్కృతిని పెంపొందించడానికి పిల్లలకు విద్యా వాతావరణం ఉండాలని మంత్రి కోరారు.భారత మాత బిడ్డలుగా చదువుకునేందుకు అందరూ విద్యాసంస్థలకు రావాలనీ. విద్యాసంస్థ‌ల్లో ఎవరూ కూడా హిజాబ్ లేదా కాషాయం కండువాలు ధరించకూడదనీ, విద్యాసంస్థ‌లు ఆదేశాల మేర‌కు న‌డుచుకోవాల‌ని సూచించారు.

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్