Karnataka: 31 నుంచి నైట్ కర్ఫ్యూ ఎత్తివేత.. స్కూళ్లు రీ ఓపెన్

By Rajesh KFirst Published Jan 29, 2022, 3:35 PM IST
Highlights

Karnataka: నైట్ కర్ఫ్యూ ఎత్తివేయాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. శ‌నివారం ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సారథ్యంలో క‌రోనా ప‌రిస్థితి మీద స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. 
 

Karnataka: కరోనా కారణంగా క‌ర్ణాట‌క‌లో నైట్ కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్ర‌స్తుతం రాష్ట్రంలో కేసులు తగ్గుముఖం పట్టాయి. పాజిటివ్ రేటు కూడా తగ్గిందని అధికారులు చెబుతున్నారు. దీంతో నైట్ కర్ఫ్యూ ఎత్తివేయాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. శ‌నివారం ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సారథ్యంలో క‌రోనా ప‌రిస్థితి మీద స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. 

ఈ సమావేశంలో ఈనెల 31వ తేదీ నుంచి నైట్ కర్ఫ్యూ ఎత్తివేయాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి 31 నుండి రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ ఉండదనీ, బెంగళూరులోని అన్ని పాఠశాలలు సోమవారం నుండి ఆఫ్‌లైన్ తరగతులను ప్రారంభించడానికి అనుమతించాని సమావేశంలో నిర్ణ‌యించారు. బెంగుళూరులోని అన్ని పాఠశాలల్లో కోవిడ్ 19 నియ‌మ నిబంధ‌న‌ల‌ను పాటించాల‌ని ఆదేశించారు. 

అలాగే, సినిమా హాళ్లు మినహా హోటళ్లు, బార్‌లు, పబ్‌లలో 50% ఆక్యుపెన్సీని అనుమతించారు. వివాహాలకు 300 మందిని అనుమతించనున్నారు. మహారాష్ట్ర, గోవా, కేరళ రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించే వ్యక్తులు కోవిడ్ నెగటివ్ సర్టిఫికేట్‌ను సమర్పించాల్సి ఉంటుందని ఆదేశాలు జారీ చేసింది క‌ర్ణాట‌క స‌ర్కార్.

click me!