మ‌ద్యం ఒక ఔష‌దం - శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్

Published : Jan 29, 2022, 03:11 PM IST
మ‌ద్యం ఒక ఔష‌దం - శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్

సారాంశం

మద్యం ఒక ఔషదమని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. సూపర్ మార్కెట్లలో వైన్ విక్రయించాలని మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన సమర్ధించారు. ఈ మేరకు శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. 

మ‌ద్యం ఒక మెడిసిన్ వంటిదని శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్ (sanjay routh) అన్నారు. సూపర్ మార్కెట్లు, వాక్-ఇన్ స్టోర్లలో వైన్ అమ్మకాలను అనుమతించాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయంపై శివసేన నాయకుడు స్పందించారు. ఈ మేర‌కు శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ప్ర‌తిప‌క్ష బీజేపీ (bjp) పై విమ‌ర్శ‌లు గుప్పించారు. దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం గ‌తంలో ఆన్‌లైన్‌లో మద్యం హోమ్ డెలివరీ ఇచ్చే విధానాన్ని రూపొందించాలని భావించింది. బీజేపీ ఎంపీ సాధ్వి ప్రగ్యా (sadvi pragya) కూడా ఓ సంద‌ర్భంలో మద్యమే ఔషధమని, దానిని తక్కువ పరిమాణంలో తాగాల‌ని సూచించార‌ని గుర్తు చేశారు. 

ఇదే విష‌యంలో శుక్ర‌వారం సంజ‌య్ రౌత్ మాట్లాడారు. ‘‘ వైన్ మద్యం కాదు’’ అని చెప్పారు. మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయ‌న సమ‌ర్ధించారు. ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం వ‌ల్ల రైతుల ఆదాయం కూడా పెరుగుతుంద‌ని అన్నారు. బీజేపీని దూషిస్తూ.. ప్రతిపక్ష పార్టీ కేవలం వ్యతిరేకిస్తోంది, కానీ రైతుల కోసం ఏమీ చేయడం లేదు అని ఆరోపించారు. వైన్ విక్రయాలు పెరిగితే రైతులకు ఆదాయం పెరుగుతుంద‌ని చెప్పారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి తాము దీనిని రూపొందించామ‌ని సంజ‌య్ రౌత్ అన్నారు. 

మ‌హారాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సూపర్ మార్కెట్లు (super markets), వాక్-ఇన్ షాపుల్లో (walk in shop) వైన్ విక్రయాలను అనుమతించే ప్రతిపాదనను మహారాష్ట్ర మంత్రివర్గం గురువారం ఆమోదించింది. ముఖ్య‌మంత్రి కార్యాల‌యం గురువారం విడుద‌ల చేసిన ప్ర‌క‌టన ప్ర‌కారం.. 1,000 చదరపు అడుగుల లేదా అంతకంటే ఎక్కువ విస్తీర్ణం కలిగిన సూపర్ మార్కెట్‌ లు, దుకాణాలు ‘మహారాష్ట్ర షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ (maharastra shops and establishment act) ’ కింద “షెల్ఫ్-ఇన్-షాప్ (shelf-in-shop)” పద్ధతిని అవలంబించవచ్చు. అంటే ప్రజలు నేరుగా ఆయా షాప్ ల‌కు వ‌చ్చి వైన్ కొనుగోలు తీసుకొని వెళ్లిపోవ‌చ్చు. అక్క‌డే తాగ‌డానికి అనుమ‌తి ఉండ‌దు. అయితే ప్రార్థనా స్థలాలు,  విద్యా సంస్థల సమీపంలోని సూపర్ మార్కెట్ల‌లో  వైన్ విక్రయించడానికి అనుమతి లేదు. మ‌ద్య నిషేదం అమ‌లుల్లో ఉన్న జిల్లాల్లో ఈ వైన్ అమ్మకాలకు అనుమ‌తి ఉండ‌ద‌ని మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం పేర్కొంది. అయితే వైన్ విక్ర‌యించాల‌ని భావించే సూపర్ మార్కెట్లు లైసెన్స్ (licence) కోసం ఏడాదికి రూ.5,000 ఫీజు చెల్లించాలి.

శివసేన నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం రాష్ట్రాన్ని ‘‘మద్య-రాష్ట్ర (మద్యం రాష్ట్రం)’’ గా మార్చాలని చూస్తోందని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (devendra padnavees) ఆరోపించారు. కొత్తగా మద్యం ఫ్యాక్టరీలు, మద్యం ఏజెన్సీలను ప్రారంభించిన వారితో ‘డీల్‌’ కుదుర్చుకున్నార‌ని అన్నారు. పారిశ్రామికవేత్తల వ్యాపార ప్రయోజనాలను సులభతరం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ‘‘ఎవరి ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారని నేను అడగాలనుకుంటున్నాను.. ఇది రైతుల ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయం కాదు. కొందరు కొత్త వ్యక్తులు మద్యం ఫ్యాక్టరీలు, మద్యం ఏజెన్సీలను ప్రారంభించారు. వారు ఎవరో మీరు కనుగొనండి. ఆ వ్య‌క్తుల కోసం ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది‘‘ అని ఫడ్నవీస్ గోవాలోని పనాజీ (Panaji)లో మీడియా సమావేశం పడ్నవీస్ అన్నారు. 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం