మహారాష్ట్రలో లాక్‌డౌన్ ఉండదు: ఉద్ధవ్ థాక్రే సంచలన నిర్ణయం

By Siva Kodati  |  First Published Apr 13, 2021, 9:05 PM IST

గత కొన్ని రోజులుగా మహారాష్ట్రలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం వీకెండ్ లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూ విధించింది. అయినప్పటికీ పరిస్ధితిలో మార్పు లేదు. 


గత కొన్ని రోజులుగా మహారాష్ట్రలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం వీకెండ్ లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూ విధించింది. అయినప్పటికీ పరిస్ధితిలో మార్పు లేదు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో లాక్‌డౌన్ అనివార్యమేనంటూ మీడియాలో వార్తలు వచ్చాయి.

కనీసం 15 రోజులైనా లాక్‌డౌన్ పెడతారంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో లాక్‌డౌన్ పెట్టే ఆలోచన లేదని తేల్చిచెప్పారు.    

Latest Videos

undefined

కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న దృష్ట్యా రేపు రాత్రి 8 గంటల నుంచి లాక్‌డౌన్ తరహా ఆంక్షలు వుంటాయని చెప్పారు. రాష్ట్రలో 15 రోజుల పాటు 144 సెక్షన్ అమల్లో వుంటుందని సీఎం తెలిపారు.

రేపు రాత్రి నుంచి మహా జనతా కర్ఫ్యూ అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. అత్యవసరమైతేనే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలని థాక్రే విజ్ఞప్తి చేశారు. అత్యవసర సేవలకే ప్రజారవాణా వినియోగించుకోవాలని.. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి తీవ్రంగా వుందని ముఖ్యమంత్రి తెలిపారు.

ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్ కొరత వుందని.. రెమ్‌డెసివర్‌కు డిమాండ్ పెరుగుతోందని ఉద్ధవ్ థాక్రే వెల్లడించారు. రాష్ట్రంలో వైద్య సౌకర్యాలు క్రమంగా పెంచుతున్నామని సీఎం చెప్పారు. 

click me!