భోజనానికి పిలిచి కోడిగుడ్డు కూర పెట్టలేదని..

Published : Oct 19, 2020, 11:39 AM IST
భోజనానికి పిలిచి కోడిగుడ్డు కూర పెట్టలేదని..

సారాంశం

తినే సమయానికి కోడిగుడ్డు వండలేదని బనార్సీ చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. భోజనానికి పిలిచి తనకు కోడిగుడ్డు కూర పెట్టలేదని స్నేహితుడితో వాగ్వాదానికి దిగాడు. ఆ వాగ్వాదం కాస్త వివాదానికి దారి తీసింది.

భోజనానికి పిలిచి కోడిగుడ్డు కూర పెట్టలేదని ఓ వ్యక్తి ప్రాణ స్నేహితుడిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ దారుణ సంఘటన మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో చోటుచేసుకుంది. 

పూర్తి వివరాల్లోకి వెళితే.. నగరంలోని మంకాపూర్‎కు చెందిన బనార్సీ అనే వ్యక్తి శనివారం రాత్రి తన ఫ్రెండ్ గౌరవ్ గైక్వాడ్‎ను భోజనానికి పిలిచాడు. ఇద్దరూ కలిసి అర్ధరాత్రి వరకు మద్యం సేవించారు. అనంతరం తినే సమయానికి కోడిగుడ్డు వండలేదని బనార్సీ చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. భోజనానికి పిలిచి తనకు కోడిగుడ్డు కూర పెట్టలేదని స్నేహితుడితో వాగ్వాదానికి దిగాడు. ఆ వాగ్వాదం కాస్త వివాదానికి దారి తీసింది.

 ఈ క్రమంలో గౌరవ్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో గౌరవ్ ఇనుపరాడ్డుతో బనార్సీ తలపై కొట్టాడు. దీంతో బన్సారీ అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు హంతకుడు గౌరవ్‎ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Indian Railways: జూలై 1 నుంచి రైల్వే కొత్త రూల్స్.. ఈ ఆ పనులు చేస్తే రూ.10 వేల వరకు జరిమానా, జైలు శిక్ష కూడా !
Traffic Jam to Crores: ట్రాఫిక్ జామ్‌లో రూ. 2.9 కోట్ల బిజినెస్.. యువకుడి మైండ్ బ్లోయింగ్ ఐడియా !