కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో స్వస్థలాలకు వెళ్లే సమయంలో ఎంత మంది వలస కూలీలు మృతి చెందారో, గాయపడ్డారో స్పష్టత సరైన సమాచారం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
న్యూఢిల్లీ:కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో స్వస్థలాలకు వెళ్లే సమయంలో ఎంత మంది వలస కూలీలు మృతి చెందారో, గాయపడ్డారో స్పష్టత సరైన సమాచారం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఈ విషయాన్ని కేంద్ర కార్మికశాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ సోమవారం నాడు పార్లమెంట్ కు చెప్పారు. బీజేడీ ఎంపీ భర్తుహరి మహతబ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు.
undefined
లాక్ డౌన్ సమయంలో వలస కార్మికులు తమ స్వగ్రామాలకు వెళ్లే సమయంలో ఎంతమంది చనిపోయారు, ఎందరు గాయపడ్డారో సరైన సమాచారం లేదని ఆయన ప్రకటించారు.
కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది మార్చి 25వ తేదీ నుండి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ నేపథ్యంలో ఉపాధి లేకపోవడంతో వలస కూలీలు తమ స్వగ్రామాలకు దేశంలోని పలు ప్రాంతాల నుండి వచ్చారు.
లాక్ డౌన్ అమలు చేయడానికి ముందు సామాజిక, ఆర్ధిక, చట్టపరమైన ఆరోగ్య హక్కులను పరిరక్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకొందా అని కూడ ఆయన ప్రశ్నించారు.