భార్య దోశెలు ఇవ్వలేదని.. భర్త ఆత్మహత్య

Published : Sep 15, 2020, 08:24 AM IST
భార్య దోశెలు ఇవ్వలేదని.. భర్త ఆత్మహత్య

సారాంశం

ఈ క్రమంలో రోజూ మద్యం తాగి ఇంటికి వచ్చి భార్యతో గొడవపడుతూ ఉండేవాడు. శనివారం రాత్రి పూటుగా తాగొచ్చిన రవిచంద్రన్‌... తనకు దోసెలు వేసివ్వాలని భార్యను అడిగాడు. ఆమె నిరాకరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. 

తన భార్య తనకు దోశెలు పెట్టలేదని ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ వింత సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఆకలివేస్తోందని దోశెలు వేయాలని భార్యను అడిగితే.. ఆమె వేయలేదనే కోపంతో  ఒంటికి నిప్పు అంటించుకొని ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తమిళనాడు రాష్ట్రం కుండ్రత్తూర్ నందంబాక్కం పెరియార్ నగర్ కు  చెందిన రవిచంద్రన్(66) మద్యానికి బానిసగా మారాడు. ఈ క్రమంలో రోజూ మద్యం తాగి ఇంటికి వచ్చి భార్యతో గొడవపడుతూ ఉండేవాడు. శనివారం రాత్రి పూటుగా తాగొచ్చిన రవిచంద్రన్‌... తనకు దోసెలు వేసివ్వాలని భార్యను అడిగాడు. ఆమె నిరాకరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. 

ఆవేశానికి గురైన రవిచంద్రన్‌ తన ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. చుట్టుపక్కల వారు గమనించి ఆయన్ను క్రోంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించగా, చికిత్స పొందతూ నేడు మృతి చెందాడు. ఈ ఘటనపై కుండ్రత్తూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

PREV
click me!

Recommended Stories

వీడు మామూలోడు కాదు.. ఫిట్ నెస్ కా బాప్ బాబా రాందేవ్ నే చిత్తుచేసిన తోపు..! (Viral Video)
IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !