మహారాష్ట్ర గవర్నర్ వ్యాఖ్యలతో ఏక్‌నాథ్ షిండే వర్గం, బీజేపీ మధ్య విభేదాలు.. ఎట్టకేలకు మౌనం వీడిన నితిన్ గడ్కరీ

Published : Nov 21, 2022, 06:09 PM IST
మహారాష్ట్ర గవర్నర్ వ్యాఖ్యలతో ఏక్‌నాథ్ షిండే వర్గం, బీజేపీ మధ్య విభేదాలు.. ఎట్టకేలకు మౌనం వీడిన నితిన్ గడ్కరీ

సారాంశం

మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీ.. ఛత్రపతి శివాజీ మహారాజ్ పై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపాయి. ఆ గవర్నర్ మరో చోటికి పంపించాలని కేంద్రంలోని బీజేపీ నేతలకు విజ్ఞప్తి చేస్తున్నట్టు ఏక్‌నాథ్ షిండే టీమ్ ఎమ్మెల్యే పేర్కొన్నారు. దీని చుట్టూ వ్యాఖ్యలు వేడెక్కడంతో ఎట్టకేలకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కూడా మౌనం వీడారు.  

ముంబయి: మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయ దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలను ఆధారం చేసుకుని ఏక్‌నాథ్ షిండే వర్గాన్ని ఉద్ధవ్ ఠాక్రే వర్గం టార్గెట్ చేసింది. దీంతో ఏక్‌నాథ్ షిండే వర్గం ఏకంగా రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీని వేరే రాష్ట్రానికి పంపించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ దుమారం కొనసాగుతుండగానే ఎట్టకేలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా మౌనం వీడారు.

‘శివాజీ మహారాజ్ మా దేవుడు. తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువగా ఆయననే పూజిస్తాం’ అని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. భగత్ సింగ్ కొశ్యారీ చేసిన వ్యాఖ్యల్లో నితిన్ గడ్కరీ పేరు కూడా ఉండటం గమనార్హం.

‘గతంలో ఎవరైనా మిమ్మల్ని మీ ఐకాన్ ఎవరు అని అడిగితే చెప్పడాలనికి చాలా మంది ఉండేవారు. జవహర్ లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ పేర్లు వినబడేవి. మహారాష్ట్రలో ఐకాన్ల కోసం మరెక్కడా చూడాల్సిన పని లేదు. ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత రోజుల ఐకాన్. ఇప్పుడు బీఆర్ అంబేద్కర్, నితిన్ గడ్కరీలు ఉన్నారు’ అని గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీ శనివారం ఈ వ్యాఖ్యలు చేశారు. నితిన్ గడ్కరీ, శరద్ పవార్‌లకు ఓ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్లను అందిస్తున్న కార్యక్రమంలో గవర్నర్ భగత్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Also Read: గవర్నర్ వెంటనే రాజీనామా చేయాలి.. ఆయన వ్యాఖ్యలు మహారాష్ట్రకు అవమానకరం: సంజయ్ రౌత్ ఫైర్

భారత్ జోడో యాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ సావర్కర్ పై వ్యాఖ్యలు చేయగానే వీధికి ఎక్కిన ఏక్‌నాథ్ షిండే టీమ్.. ఇప్పుడు గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీ శివాజీ మహారాజ్ పై వ్యాఖ్యలు చేయగానే ఎందుకు కలుగులోకి వెళ్లి దాక్కుందని ఉద్ధవ్ టీమ్ ప్రశ్నించింది. ఉద్ధవ్ ఠాక్రే టీమ్ విమర్శల నేపథ్యంలో ఏక్‌నాథ్ షిండే టీమ్ ఎమ్మెలయే సంజయ్ గైక్వాడ్ గవర్నర్ వ్యాఖ్యలను విమర్శించారు.

ఛత్రపతి శివాజీ మహారాజ్ నిరంతరం వెలిగే గొప్ప వ్యక్తి అని గవర్నర్ అర్థం చేసుకోవాలని అన్నారు. రాష్ట్ర చరిత్ర తెలియని, అది ఎలాపని చేస్తుందో తెలియని గవర్నర్‌ను మరో చోటికి పంపాలని కేంద్రంలోని బీజేపీ నేతలకు విజ్ఞప్తి చేస్తున్నట్టు పేర్కొన్నారు. దీంతో బీజేపీ, ఏక్‌నాథ్ షిండే వర్గం మధ్య పొరపొచ్చాలు వచ్చాయా? అనే చర్చ మొదలైంది. 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం