ఫిన్‌టెక్ హాకథాన్ ప్రకటించిన నీతి అయోగ్, ఫోన్‌పే.. రూ. 5 లక్షల వరకు క్యాష్ ప్రైజ్.. ఇక్కడ దరఖాస్తు చేసుకోండి

Published : Feb 18, 2022, 07:25 PM ISTUpdated : Feb 18, 2022, 07:45 PM IST
ఫిన్‌టెక్ హాకథాన్ ప్రకటించిన నీతి అయోగ్, ఫోన్‌పే.. రూ. 5 లక్షల వరకు క్యాష్ ప్రైజ్.. ఇక్కడ దరఖాస్తు చేసుకోండి

సారాంశం

నీతి అయోగ్, ఫోన్‌పేలు తొలిసారి సంయుక్తంగా హాకథాన్‌ను నిర్వహించనున్నట్టు ప్రకటించాయి. ఫిన్‌టెక్ సెక్టార్‌లో సరికొత్త సొల్యూషన్‌లతో వచ్చే పార్టిసిపెంట్లకు రూ. 5 లక్షలకు వరకూ క్యాష్ ప్రైజ్‌లు ఉన్నట్టు తెలిపింది. హాకథాన్‌లో పాల్గొనేవారు.. ఈ నెల 23వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.   

న్యూఢిల్లీ: నీతి అయోగ్ (Niti Ayog), ఫోన్‌పే (Phone pe) తొలిసారిగా హాకథాన్‌ (Hackathon)ను సంయుక్తంగా నిర్వహించడానికి నిర్ణయించాయి. ఫిన్‌టెక్ పరిశ్రమ (Fintech Industry) ప్రాధాన్యతను వెల్లడించడానికి ఈ హాకథాన్‌ను ప్రకటించాయి. ఫిన్‌టెక్ రంగంలో సరికొత్త పరిష్కారాలు కనుగొనడమే ఈ హాకథాన్ లక్ష్యంగా ఉంటుందని అవి ఓ ప్రకటనలో వెల్లడించాయి. ఈ ఈవెంట్‌లో తమ దరఖాస్తులు రిజిస్టర్ చేసుకోవడానికి 23 చివరి తేదీ. ఫైనల్ ఎంట్రీలకు ఫిబ్రవరి 25వ తేదీ గడువు. ఈ హాకథాన్ విన్నర్‌లను 28వ తేదీన ప్రకటిస్తారు. ఈ హాకథాన్ గురించిన సందేహాలు ఏమి ఉన్నా పార్టిసిపేంట్లు నివృత్తి చేసుకోవచ్చని, ఇందుకోసం 21వ తేదీ సాయంత్రం 4 గంటలకు లైవ్ ఏఎంఏ నిర్వహిస్తున్నారు.

ఈ హాకథాన్‌లో విజేతలకు అద్భుతమైన ప్రైజులను ప్రకటించారు. విన్నింగ్ టీమ్‌కు రూ. 5 లక్షలు అందిస్తారు. అంతేకాదు, టాప్ 5 విన్నర్‌లకూ క్యాష్ ప్రైజ్‌ ప్రకటించారు. టాప్‌ 5లో ఫష్ట్ ప్లేస్ టీమ్‌కు ఫస్ట్ ప్రైజు కింద రూ. 1.50 లక్షలు క్యాష్ మనీ ఇవ్వనున్నారు. సెకండ్ ప్లేస్‌లో రెండు టీమ్‌లకు క్యాష్ ప్రైజు ఇవ్వనున్నారు. రూ. 1 లక్ష చొప్పున సెకండ్ ప్లేస్ టీమ్‌లకు అందిస్తారు. థర్డ్ ప్లేస్‌లోనూ రెండు టీమ్‌లకు క్యాష్ ప్రైజ్ ఇవ్వనున్నారు. థర్డ్ ప్లేస్ టీమ్‌లకు రూ. 75 వేలు అందించనున్నారు.

అంతేకాదు, ఈ హాకథాన్‌లో పాల్గొన్న టీమ్‌ల హ్యాక్స్ ఆధారంగా న్యాయనిర్ణేతలు అవార్డును పెంచడం లేదా తగ్గించడమూ చేయవచ్చు. ఈ హాకథాన్ గురించిన మరింత సమాచారం కోసం లేదా దరఖాస్తు చేసుకోవడానికి https://cic.niti.gov.in/fintech-open-month-hackathon.html‌ను సందర్శించవచ్చు.

హాకథాన్‌లో పాల్గొనేవారు ఫోన్‌పే పల్స్ వంటి ఏవైనా ఓపెన్ డేటా ఏపీఐలను వినియోగించుకోవాలి. అకౌంట్ అగ్రిగేటర్ వంటి ఫ్రేమ్‌వర్క్‌లను వాడుకోవచ్చు. ఆల్టర్నేట్ రిస్క్ మాడల్స్ ఫర్ లెండింగ్, ఆర్థిక సంఘటితం లక్ష్యంగా చేపట్టే ఇన్సూరెన్స్ లేదా పెట్టుబడులు వంటి వాటికి ఓపెన్ డేటా ఏపీఐ, అకౌంట్ అగ్రిగేటర్ వంటి ఫ్రేమ్‌వర్క్‌లను ఆధారంగా ఉపయోగించుకోవాలి. ఆర్థిక సేవలను మరింత విస్తారంగా అందుబాటులోకి తేవడానికి విభిన్న భౌగోళిక, ప్రజా సమూహాల సమాచారాన్ని వినియోగించుకునే ఇన్నోవేటివ్ ప్రాడక్టులను, డిజిటల్ పేమెంట్ డేటా ఆధారంగా మెరుగైన విజువలైజేషన్స్, ఇంటెలిజెన్స్‌లపై ఫోకస్ పెట్టాలని తెలిపాయి. పార్టిసిపెంట్లు తయారు చేసిన ఫైనల్ అప్లికేషన్‌లో పై అంశాల్లో ఏదో ఒకటైనా కచ్చితంగా ఉండాలని వివరించాయి.

సెటు ఏఏ శాండ్‌బాక్స్, లేదా సెటు పేమెంట్స్ శాండ్‌బాక్స్  లేదా ఇతర ఏ ఓపెన్ డేటా ప్లాట్‌ఫామ్స్ అయినా పార్టిసిపెంట్లు వినియోగించుకోవచ్చు. వీటిని వినియోగించుకుని పార్టిసిపెంట్లు తమ హ్యాక్స్ అభివృద్ధి చేసుకోవచ్చు. పార్టిసిపెంట్లు తమ పని చేసే ప్రొటోటైప్‌‌ను న్యాయనిర్ణేతలకు ప్రెజెంట్ చేయాలని, ఆ తర్వాత నిర్దేశిత పారామీటర్ల ఆధారంగా వాటిని జడ్జ్ చేస్తారని ఆ ప్రకటన తెలిపింది.

ఇదిలా ఉండగా, ఆరోగ్య రంగం పనితీరుపై NITI ఆయోగ్ (నేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా) విడుద‌ల చేసిన ఆరోగ్యసూచిలో తెలంగాణ‌ మూడవ స్థానంలో నిలిచింది. గ‌తేడాది మూడోస్థానంలో ఉన్న ఏపీ.. ఒక స్థానానికి దిగజారి నాలుగో స్థానంలో నిలిచింది.

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌