
న్యూఢిల్లీ: భారత దేశం(India)లో సంపన్న కుటుంబాలు(Millionaire Households) ఎక్కడ ఎక్కువగా ఉంటాయి? వారి ఆలోచనా విధానాలు ఎలా మారుతున్నాయి? పెట్టుబడుల్లో వారి ఫిలాసఫీ ఏమిటీ? వారి అలవాట్లు ఏమిటి? వంటి ఆసక్తికర విషయాలను ఓ సర్వే వెల్లడించింది. హురున్ ఇండియా వెల్త్ రిపోర్ట్(Hurun Wealth Report) 2021, లగ్జరీ కన్జ్యూమర్ సర్వే ఈ వివరాలను తెలిపింది. హురున్ ఇండియా వెల్త్ రిపోర్టు ప్రకారం మిలియనీర్ కుటుంబాలు అత్యధికంగా ఉంటున్న నగరాల జాబితానూ వెల్లడించింది. ఒక మిలియన్ డాలర్ల నెట్‌వర్త్ ఉన్న మిలియనీర్ కుటుంబాలను ఇందులో చేర్చింది.
ఈ రిపోర్టుల ప్రకారం గతేడాదితో పోల్చితే.. మిలియన్ డాలర్ల సంపద ఉన్న కుటుంబాలు 11 శాతం పెరిగాయి. నేడు దేశంలో 4.58 లక్షల కుటుంబాలు ఉన్నాయి. కాగా, వచ్చే ఐదేళ్లలో అంటే 2026 కల్లా మిలియనీర్ కుటుంబాల సంఖ్య 30 శాతం పెరిగి ఆరు లక్షలకు చేరవచ్చని నివేదిక అంచనా వేసింది. కాగా, నగరాల వారీగా కుటుంబాల సంఖ్యను లెక్కిస్తే ఆసక్తికర విషయం బయటపడింది. అత్యధిక మిలియనీర్ కుటుంబాలు ఎక్కువగా ముంబయిలో ఉన్నారు. ముంబయిలో 20,300 మిలయనీర్ కుటుంబాలు, ఆ తర్వాత స్థానాల్లో ఢిల్లీ, కోల్‌కతా ఉన్నాయి. ఢిల్లీలో 17,400 మిలియనీర్ కుటుంబాలు, కోల్‌కతాలో 10,500 మిలియనీర్ కుటుంబాలు ఉన్నాయి.
కాగా, ఇందులో 36 శాతం మంది కుటుంబాలు ఈ వ్యాలెట్లు, లేదా యూపీఐ పేమెంట్ పద్ధతులను ఎంచుకుంటున్నాయి. గతేడాది ఈ వ్యాలెట్లు, యూపీఐ పేమెంట్ మెథడ్లను 18 శాతం మిలియనీర్ కుటుంబాలు అనుసరించేవి. ఇప్పుడు 36 శాతానికి పెరిగింది. కాగా, పెట్టుబడులకు సంబంధించిన కీలకమైన బిహేవియర్ చేంజ్‌నూ రిపోర్టు వెల్లడించింది. రిస్కు లేని మార్గాల్లోనే పెట్టుబడులు పెడతామని, అదే తమ ఫిలాసఫీ అని మూడింట ఒక వంతు హై నెట్‌వర్త్ వ్యక్తులు వెల్లడించారు. పెట్టుబడులకు స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ వారికి ఇష్టమైన రంగం అని తెలిపారు.
హురున్ సర్వేలో పేర్కొన్న కనీసం 70 శాతం హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్(హెచ్‌ఎన్ఐ)లు వారి పిల్లలను చదువుల కోసం విదేశాలకు పంపాలనే భావిస్తున్నారు. అందులోనూ ఫస్ట్ ప్లేస్ యూఎస్ ఉన్నది. ఆ తర్వాత యూకే, న్యూజిలాండ్, జర్మనీలు ఉన్నాయి. ఈ రిపోర్టు ప్రకారం, వీరి అలవాట్లలో చేతి గడియారాల సేకరణ ఉన్నది. అందులోనూ రోలెక్స్ వాచ్‌ను సేకరించే వారి సంఖ్య ఎక్కువ. ఈ సర్వేలో పాల్గొన్న 63 శాతం మంది కనీసం నాలుగు వాచ్‌లు కలిగి ఉన్నారు. మూడేళ్లలో ఒక సారి వారు కార్లు మారుస్తారని తెలిపారు. వారు మార్చే లగ్జరీ కార్ల బ్రాండ్‌లో మెర్సిడెస్ బెంజ్ ఉన్నది. ఆ తర్వాతి స్థానంలో రోల్స్ రాయిస్ ఉన్నది.
ప్పటికే భారత్ లో అపర కుబేరుడిగా నిలిచిన అదానీ మరో కొత్త మైలు రాయిని చేరుకున్నారు. 88.5 బిలియన్ డాలర్ల సంపదతో ఆసియాలోనే నెంబర్ వన్ రిచెస్ట్ పర్సన్ గా నిలిచారు. దేశీయ కుబేరుల జాబితాలో అగ్రగామిగా వెలుగొందుతున్న ముకేశ్ అంబానీకి గట్టి షాక్ తగిలింది. తొలి స్థానంలో కొనసాగుతున్న అంబానీ ర్యాంక్ రెండో స్థానానికి పడిపోయింది. అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదానీ మొదటి ర్యాంక్‌ను దక్కించుకున్నారు.