ముగిసిన నీతి ఆయోగ్ సమావేశం.. మోడీ ముందు సీఎంల ప్రతిపాదనలు, జీఎస్టీపై విమర్శలు

By Siva KodatiFirst Published Aug 7, 2022, 5:21 PM IST
Highlights

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ముగిసింది. పప్పులు, నూనె గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడం, పంటల మార్పిడి, జాతీయ నూతన విద్యావిధానం అమలుతో పాటు పలు అంశాలపై సమావేశంలో చర్చించారు
 

ఆదివారం ప్రధాని అధ్యక్షతన కొన్నిగంటల పాటు సాగిన నీతి ఆయోగ్ సమావేశం (niti aayog) ముగిసింది. ఈ సమావేశంలో కేంద్రానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా పప్పులు, నూనె గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడం, పంటల మార్పిడి, జాతీయ నూతన విద్యావిధానం అమలుతో పాటు పలు అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు , కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. అయితే కీలక నేతలైన తెలంగాణ సీఎం కేసీఆర్, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ డుమ్మా కొట్టారు. జూలై 2019లో జరిగిన నీతి ఆయోగ్ సమావేశం తర్వాత .. పాలకమండలి సభ్యులు మళ్లీ భౌతికంగా హాజరుకావడం ఇదే తొలిసారి. 

ALso REad:ప్రధాని అధ్యక్షతన మొదలైన నీతి ఆయోగ్ సమావేశం అజెండాలో కీలక అంశాలివే..!

కాగా.. జీఎస్టీ పరిహారం మరో ఐదేళ్లు పొడిగించాలని ఛత్తీస్‌గఢ్ సీఎం విజ్ఞప్తి చేశారు. ఉపాధి హామీ పథకాన్ని 20 వేల జనాభా వున్న గ్రామాల్లోనూ అమలు చేయాలని ఆయన కోరారు.  జీఎస్టీతో రాష్ట్రాలు ఆదాయం కోల్పోతున్నాయని.. రాష్ట్రాలు, కేంద్రం మధ్య నీతి ఆయోగ్ అంబుడ్స్‌మన్‌లా వ్యవహరించాలని ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ కోరారు. కొన్ని పథకాల విషయంలో కేంద్రం, రాష్ట్రాల మధ్య విభేదాలు వున్నాయని నవీన్ పట్నాయక్ అన్నారు. 

click me!