మేక్ మై ట్రిప్‌ నకు చైనాతో సంబంధాలున్నాయి..ఈజ్‌ మై ట్రిప్ వ్యవస్థాపకుడు!

Published : May 17, 2025, 06:18 AM IST
మేక్ మై ట్రిప్‌ నకు చైనాతో సంబంధాలున్నాయి..ఈజ్‌ మై ట్రిప్ వ్యవస్థాపకుడు!

సారాంశం

మేక్‌మైట్రిప్ బోర్డు చైనా వ్యక్తులతో నిండిపోయిందని ఈజ్‌మైట్రిప్ అధినేత నిశాంత్ పిట్టీ తీవ్ర ఆరోపణలు చేశారు.

భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో, తుర్కియే, అజర్‌బైజాన్ దేశాలపై దేశంలో బహిష్కరణ స్వరం పెరిగింది. సోషల్ మీడియాలో ఈ దేశాల ఉత్పత్తులు, ప్రయాణాలు బహిష్కరించాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ట్రావెల్ కంపెనీ ఈజ్‌మైట్రిప్ వ్యవస్థాపకుడు నిశాంత్ పిట్టీ చేసిన ఆరోపణలు తాజాగా చర్చనీయాంశంగా మారాయి.నిశాంత్ ఎక్స్‌లో చేసిన పోస్ట్ ప్రకారం, భారత సైనికులు ఒక చైనా యాజమాన్యంలో ఉన్న ట్రావెల్ ప్లాట్‌ఫామ్ ద్వారా డిస్కౌంట్ టికెట్లను బుక్ చేసుకుంటున్నారు. వారు తమ డిఫెన్స్ ఐడీ, ప్రయాణ మార్గాలు, తేదీలు వంటి వివరాలు ఆ యాప్‌లో నిక్షిప్తం చేస్తున్నారని తెలిపారు. దీని వల్ల మన దేశ సైనికుల గమ్యస్థానాలు విదేశీ సంస్థలకు తెలుస్తాయన్నది ఆయన వాదన.

అయితే మొదటిది ఈ పోస్ట్‌లో సంస్థ పేరును స్పష్టంగా చెప్పకపోయినా, స్క్రీన్‌షాట్లు మాత్రం పోస్ట్ చేశారు.ఇదే సమయంలో మేక్‌మైట్రిప్ సంస్థ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించింది. తమది పూర్తిగా భారతీయ సంస్థగా, దేశ చట్టాలకు అనుగుణంగా పని చేస్తున్నామని పేర్కొంది. డేటా భద్రతకు సంబంధించి అన్ని నిబంధనలకూ కట్టుబడి ఉన్నామంటూ స్పష్టం చేసింది. అయితే నిశాంత్ దీంతో ఊరుకోలేదు.తాజాగా ఆయన మరో పోస్ట్‌ చేశారు. ఈసారి మేక్‌మైట్రిప్ సంస్థను నేరుగా ఉద్దేశించి మాట్లాడారు. సంస్థ డైరెక్టర్ బోర్డు మొత్తం 10 మందిలో ఐదుగురు చైనా వ్యక్తులేనని ఆరోపించారు. వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకునే నాలుగు బోర్డు కమిటీల్లో మూడు చైనా అనుబంధ డైరెక్టర్ల చేతిలోనే ఉన్నాయని తెలిపారు.

అంతేకాదు, చైనా వ్యక్తులు డైరెక్టర్లుగా ఉన్నట్లు చూపించే స్క్రీన్‌షాట్లను కూడా పోస్ట్ చేశారు. మే 14న కొత్త డైరెక్టర్‌ను నియమించినంత మాత్రాన కంపెనీ చైనా మూలాలను పూర్తిగా తుడిచేస్తే కాదని ఆయన విమర్శించారు.జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకుని ఇటువంటి వ్యవహారాలపై ప్రభుత్వ స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. అయితే నిశాంత్ తాజా ఆరోపణలపై మేక్‌మైట్రిప్ సంస్థ ఈ దాకా స్పందించలేదు.ఇటీవల దేశవ్యాప్తంగా చైనా, తుర్కియే సంబంధిత సంస్థలపై నెగటివ్ సెంలిమెంట్ పెరుగుతున్న సమయంలో, ఈ ఆరోపణలు మరింత ఉత్కంఠకు దారి తీస్తున్నాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nepal Flash Floods: ప్రస్తుతం నేపాల్ పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు | Rescue Operations Continue
Nepal Flash Floods: నేపాల్ వరదల్లో వైరలైన ఇల్లు నిర్మాణ రహస్యం ఇదే | Asianet News Telugu