తాను మంత్రినని గ్రహించి మాట్లాడాలి..: ఉదయనిధిపై నిర్మలా సీతారామన్ ఫైర్

Published : Sep 17, 2023, 05:24 AM IST
తాను మంత్రినని గ్రహించి మాట్లాడాలి..: ఉదయనిధిపై నిర్మలా సీతారామన్ ఫైర్

సారాంశం

సనాతన్‌పై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం మాట్లాడుతూ.. తాను రాష్ట్ర మంత్రినన్న విషయాన్ని ఉదయనిధి గుర్తుంచుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరికి హక్కు ఉందని, తన అభిప్రాయాలను వెల్లడించవచ్చని అన్నారు. అయితే మంత్రి అయ్యాక బాధ్యతలు చూసుకుని మాట్లాడాలని హితవు పలికారు.

సనాతన్‌పై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పందించారు.. తాను రాష్ట్ర మంత్రినన్న విషయాన్ని ఉదయనిధి గుర్తుంచుకోవాలని చురకలంటించారు. మంత్రిగా తన బాధ్యతను అర్థం చేసుకుని మాట్లాడాలని హితవు పలికారు. విలేకరులతో నిర్మల మాట్లాడుతూ.. ఏ మతాన్ని అయినా తొలగిస్తానని చెప్పే హక్కు ఎవరికీ లేదనీ,  అలాంటి ప్రకటన చేయడం తప్పని అన్నారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని ఉదయనిధి చెప్పడం సమంజసం కాదని అన్నారు.

రాజ్యాంగం ప్రకారం ఎవరి భావజాలం ఉన్నా, ప్రభుత్వ పదవిలో ప్రమాణం చేసిన తర్వాత, మతాన్ని నిర్మూలించడం గురించి మాట్లాడే అధికారం ఎవరికీ, ప్రత్యేకించి మంత్రికి లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం అన్నారు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఇటీవల సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై ఆమె విలేకరులతో మాట్లాడారు.

బహిరంగ సభలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తప్పని,  తర్వాత వ్యాఖ్యలపై వివరణ ఇవ్వడం ఆమోదయోగ్యం కాదని అన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు బాధ్యతాయుతంగా మాట్లాడాలని,  హింసను ప్రేరేపించే భాషలో వారు మాట్లాడకూడదని శ్రీమతి సీతారామన్ అన్నారు. 1971లో తమిళనాడులో శ్రీరాముడిని అవమానించినప్పటికీ.. సనాతన ధర్మం హింసాత్మకంగా రియాక్ట్ అవ్వలేదని గుర్తుకు చేశారు. 

అంతకుముందు సొసైటీ ఆఫ్ ఆడిటర్స్ 90వ వార్షికోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. చార్టర్డ్ అకౌంటెంట్లు పన్ను ఎగవేత సమస్యలపై ధ్వజమెత్తాలని అన్నారు. CAలు తమ ఖాతాదారులకు పన్ను ఎగవేయవద్దని, నిధులను మళ్లించవద్దని సూచించాలి. ఎగవేత సందర్భాలు కనిపిస్తే అధికారులను అప్రమత్తం చేయండని శ్రీమతి సీతారామన్ అన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దుర్వినియోగం అవుతుందన్న దుమారం చెలరేగిందని ఆమె ఎత్తిచూపారు.  డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డొమైన్‌లో గత 60 ఏళ్లలో గత ప్రభుత్వాలు చేయలేనిది కేవలం 10 సంవత్సరాలలో ప్రభుత్వం సాధించిందనీ, ఈ విషయాన్ని ప్రపంచబ్యాంకు తెలియజేసిందని ఆమె చెప్పారు. 
 

PREV
click me!

Recommended Stories

IAF Recruitment : కేవలం ఇంటర్ అర్హతతో... ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాల భర్తీ
Ahmedabad International Kite Festival సంక్రాంతి సంబరాల్లో పతంగ్ లు ఎగరేసిన మోదీ| Asianet News Telugu