ర‌ష్యా చమురు.. ప్ర‌ధాని మోడీ నిర్ణ‌యంపై నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌శంస‌లు

By Mahesh RajamoniFirst Published Sep 8, 2022, 3:22 PM IST
Highlights

రష్యా చమురుపై ప్రధాని న‌రేంద్ర మోడీ తీసుకున్న నిర్ణ‌యాన్ని ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామన్ ప్రశంసించారు. ఉక్రెయిన్ తో యుద్ధం నేప‌థ్యంలో ర‌ష్యాపై అనేక దేశాలు ఆంక్ష‌లు విధించిన విష‌యాన్ని మంత్రి గుర్తుచేశారు. 
 

Union Finance Minister Nirmala Sitharaman: ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభానికి దారితీసిన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, దాని పర్యవసానాల గురించి మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రశంసించారు. రెండు దేశాల మధ్య ఫిబ్రవరి 24న ప్రారంభమైన యుద్ధం నేపథ్యంలో చమురు ధరల పెరుగుదల ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనల‌ను పెంచింది. సంక్షోభ ప‌రిస్థితుల‌ను క‌ల్పించింది. ఈ క్ర‌మంలో భార‌త్ ర‌ష్యాపై ఆంక్ష‌ల‌ను ప‌క్క‌న‌పెడుతూ ఆ దేశం నుంచి చ‌మురు గొనుగోలుకు వెన‌క‌డుగు వేయ‌కుండా ముందుకు సాగింది.

ర‌ష్యా చ‌మురు విష‌యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చాలా బ‌ల‌మైన నిర్ణ‌యం తీసుకున్నార‌నీ, ఆ ధైర్య‌వంత‌మైన నిర్ణ‌యం తీసుకున్న ప్ర‌ధాని మోడీపై త‌న ప్ర‌శంస‌లు కురిపిస్తున్నాన‌ని తెలిపారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇంధ‌నం విష‌యంలో ఒత్తిగి నెల‌కొన్న స‌మ‌యంలో.. ఉక్రెయిన్ పై యుద్ధం నేప‌థ్యంలో అనేక దేశాలు ర‌ష్యాపై ఆంక్ష‌లు విధించాయి. అయితే, ప్ర‌ధాని మోడీ ర‌ష్యా నుంచి చ‌మురు దిగుమ‌తికి అనుకూలంగా నిర్ణ‌యం తీసుకున్నారు.

 

 

| I respect the PM for his courage to get it (crude oil) from Russia because they are willing to give on discount... our entire import had 2% of Russian component, it was ramped up to 12-13% within a couple of months: Finance Minister Nirmala Sitharaman, in Delhi pic.twitter.com/xmRFptKXgb

— ANI (@ANI)

"ఇంధ‌న సంక్షోభం ఉన్న స‌మ‌యంలో ప్ర‌ధాని మోడీ రాజ‌కీయంగా చాలా బ‌ల‌మైన నిర్ణ‌యం తీసుకోవ‌డాన్ని నేను గౌర‌విస్తాను. ఎందుకంటే చ‌మురు దిగుమ‌తికి ర‌ష్యా  మ‌రింత త‌గ్గింపు ఇవ్వ‌డానికి సిద్ధంగా ఉంది" అని ఆర్థిక మంత్రి అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడి ఉన్నప్పటికీ రష్యా చమురుపై ఆధారపడటాన్ని కొనసాగించాలని ప్రధాని న‌రేంద్ర మోడీ నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్-ర‌ష్యా యుద్ధం ప్రారంభమైన వెంటనే, యునైటెడ్ స్టేట్స్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర దేశాలు మాస్కోపై నిరోధక చర్యగా అనేక ఆంక్షలను విధించాయి. అయితే, భారతదేశం అతిపెద్ద ప్రపంచ ఎగుమతిదారుల్లో ఒకటైన రష్యా నుండి చమురు కొనుగోలును కొనసాగించింది. ర‌ష్యా దిగుమ‌తులు రెండు శాతం నుంచి ఏకంగా 12-13 శాతానికి పెరిగిన విష‌యాన్ని నిర్మాలా సీతారామ‌న్ ప్ర‌స్తావించారు. దేశ రాజ‌ధాని ఢిల్లీలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ ఆమె పై విష‌యాల‌ను పేర్కొన్నారు. "ఆంక్షలు ఉన్నప్పటికీ, అదే రష్యన్ చమురును పొందడానికి దేశాలు తమ మార్గంలో పోరాడుతున్నాయి" అని ఆమె జోడించారు. 

Sanctions, sanctions but countries are finding their own way to get that Russian crude, gas... I give credit to the statesmanship of the PM to make sure that we keep our relationship with all countries & yet manage to, till today, get the Russian fuel...: FM Nirmala Sitharaman pic.twitter.com/z4CVid4yod

— ANI (@ANI)

కొన్ని నెలల క్రితం, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తన విదేశీ పర్యటన సందర్భంగా.. పశ్చిమ దేశాల నుండి ఒత్తిడి ఉన్నప్పటికీ రష్యాపై భారతదేశం ఇంధన ఆధారపడటంపై వచ్చిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. ఆయన వ్యాఖ్యలపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

click me!