మా పోరాటం ఆగదు.. రేపు క్షమాభిక్ష కావాలంటారేమో: నిర్భయ తల్లి

First Published Jul 9, 2018, 4:06 PM IST
Highlights

నిర్భయ కేసులో ముగ్గురు దోషులకు ఉరే సరే అంటూ సుప్రీంకోర్టు తేల్చి చెప్పడంపై నిర్భయ తల్లి ఆశా దేవి హర్షం వ్యక్తం చేశారు. తమ పోరాటం ఇంతటితో ఆగదని.. చట్టపరమైన చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయన్నారు. 

నిర్భయ కేసులో ముగ్గురు దోషులకు ఉరే సరే అంటూ సుప్రీంకోర్టు తేల్చి చెప్పడంపై నిర్భయ తల్లి ఆశా దేవి హర్షం వ్యక్తం చేశారు. తమకు విధించిన ఉరిశిక్షను  రద్దు చేసి జీవితఖైదుగా మార్చాలంటూ.. గత తీర్పును పున:సమీక్షించాలంటూ నిర్భయ దోషులు ముఖేశ్, పవన్, వినయ్‌లు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం ఆ పిటిషన్‌ను కొట్టివేసింది.  దోషులు చేసింది క్షమించరాని నేరమని పేర్కొంది...

తీర్పు అనంతరం మీడియాతో మాట్లాడిన నిర్భయ తల్లి ఆశా దేవి.. తమ పోరాటం ఇంతటితో ఆగదని.. చట్టపరమైన చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయన్నారు. వాళ్లకు శిక్ష పడటానికి మరో అడుగుదూరంలో ఉన్నారని అపరాధులు రాష్ట్రపతిని అడగటానికి ముందే ఉరిశిక్షను సవాల్ చేస్తూ మరో పిటిషన్‌ను దాఖలు చేయవచ్చేమోనని ఆమె సందేహం వ్యక్తం చేశారు. శిక్ష అమలులో జాప్యం కారణంగా సమాజంలో ఇతర కూతుళ్లకు అన్యాయం జరుగుతోందన్నారు.

న్యాయవ్యవస్థను మరింత పటిష్టం చేయాలని ఆమె న్యాయశాఖను కోరారు... వీలైనంత త్వరగా దోషులకు ఉరి వేసి నిర్భయకు న్యాయం చేయాలని ఆశాదేవి డిమాండ్ చేశారు. సుప్రీం తీర్పుతో తమకు న్యాయవ్యవస్థపై నమ్మకం మరింత పెరిగిందన్నారు.. కోర్టు రివ్యూ పిటిషన్‌ను కొట్టివేస్తుందని నాకు ముందే తెలుసు.. కానీ ఆ తర్వాత ఏంటీ..? ఈ మధ్యకాలంలో మహిళలకు ప్రమాదం మరింత పెరిగిందన్నారు.. వీలైనంత త్వరలోనే దోషులకు ఉరిశిక్ష అమలవుతుందని నిర్భయ తండ్రి బద్రీనాథ్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.. 

2012 డిసెంబర్ 16వ తేదీ రాత్రి 23 ఏళ్ల వైద్య విద్యార్థిని ఆమె స్నేహితుడితో కలిసి దక్షిణ ఢిల్లీలోని ఓ సినిమా హల్లో సినిమా చూసి బస్సులో వస్తుండగా.. ఆరుగురు వ్యక్తులు ఆమె స్నేహితుడిని కొట్టి.. నిర్భయపై కదిలే బస్సులో అత్యాచారానికి పాల్పడి.. ఆమె మర్మావయావాల్లోకి ఐరన్ రాడ్ చొప్పించి అమానుషంగా ప్రవర్తించి... నగ్నంగా రోడ్డు మీదకు విసిరేశారు.

ప్రాణాల కోసం పోరాడి చివరికి నిర్భయ మరణించింది. ఈ సంఘటనతో యావత్ దేశంఉలిక్కిపడింది. ఈ దారుణానికి పాల్పడిని ఆరుగురికి సుప్రీంకోర్టు మరణశిక్ష విధించింది. వీరిలో ఒకరు తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకోగా...మరొకరు మైనర్ కావడంతో మూడేళ్ల శిక్ష తర్వాత విడుదలయ్యాడు.. మిగిలిన వారు శిక్ష అనుభవిస్తున్నారు.

click me!