ఎంతకాలం కాపాడతారు.. కన్నీరుమున్నీరైన నిర్భయ తల్లి

By Siva KodatiFirst Published Jan 31, 2020, 6:10 PM IST
Highlights

రేపు నిర్భయ దోషులకు ఉరిశిక్షను వాయిదా వేస్తూ ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో నిర్భయ తల్లీ ఆశా దేవి దిగ్భ్రాంతికి గురయ్యారు. ఉరిశిక్షకు అమలుపై స్టే విధిస్తూ శుక్రవారం ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో ఆశా దేవి కన్నీరుమున్నీరవుతున్నారు

రేపు నిర్భయ దోషులకు ఉరిశిక్షను వాయిదా వేస్తూ ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో నిర్భయ తల్లీ ఆశా దేవి దిగ్భ్రాంతికి గురయ్యారు.

ఉరిశిక్ష అమలుపై స్టే విధిస్తూ శుక్రవారం ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో ఆశా దేవి కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏడేళ్లుగా తమకు అన్యాయం జరుగుతోందని.. దోషులను కోర్టులు పదే పదే రక్షిస్తున్నాయని ఆమె ఆరోపించారు.

Also Read:నిర్భయ కేసు: రేపు దోషులకు ఉరిశిక్ష లేదు, కోర్టు స్టే

ప్రభుత్వం, కోర్టులు కావాలనే దోషులను కాపాడుతున్నాయని.. అయినప్పటికీ వారికి ఉరిశిక్ష పడేవరకు పోరాడుతానని ఆశాదేవి స్పష్టం చేశారు. దోషులు ఏం కోరుకుంటున్నారో కోర్టులో అదే జరుగుతోందని, ఇప్పటికైనా చట్టాల్లో మార్పులు చేయాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అంతకుముందు నిర్భయ దోషుల్లో ఒకరైన పవన్ గుప్తా సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగింది. తన జువైనల్ పిటిషన్‌ను గతంలో సుప్రీంకోర్టు కొట్టివేయడంతో.. అతను ఈ తీర్పును సవాల్ చేస్తూ మరోసారి రివ్యూ పిటిషన్ దాఖలు చేశాడు.

Also Read:నిర్భయ కేసు: పవన్ గుప్తా పిటిషన్ కొట్టివేసిన సుప్రీం

2012లో నిర్భయపై అత్యాచారానికి పాల్పడే సమయానికి తాను మైనర్‌నని పవన్ వాదించాడు. అయితే దీనిని సుప్రీంకోర్టు కొట్టివేసింది. గతంలో తాము పిటిషన్‌ను తిరస్కరించామని.. వయసు గురించి పదే పదే పిటిషన్ దాఖలు చేయడం సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. 
 

click me!