నిర్భయ మిత్రుడు ఏం చేస్తున్నాడు.. ఎక్కడున్నాడు

By sivanagaprasad KodatiFirst Published Dec 19, 2019, 4:18 PM IST
Highlights

నిర్భయపై దుండగుల అఘాయిత్యం జరిగిన సమయంలో బాధితురాలి పక్కనేవున్న ఆమె స్నేహితుడు అవనీంద్ర అభీ ప్రస్తుతం ఏం చేస్తున్నాడు..? ఎక్కడ ఉన్నాడు అనే దానిపై దేశప్రజలు చర్చించుకుంటున్నారు

నిర్భయ నిందితుల ఉరి శిక్షపై వాదనలు కొనసాగుతున్న వేళ.. నిర్భయపై దుండగుల అఘాయిత్యం జరిగిన సమయంలో బాధితురాలి పక్కనేవున్న ఆమె స్నేహితుడు అవనీంద్ర అభీ ప్రస్తుతం ఏం చేస్తున్నాడు..? ఎక్కడ ఉన్నాడు అనే దానిపై దేశప్రజలు చర్చించుకుంటున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో అతని కుటుంబ సభ్యులు ఉంటుండగా... అవనీంద్ర అభీ రహస్య జీవనం గడుపుతున్నాడని తెలుస్తోంది. కాగా అవనీంద్ర తండ్రి ప్రతాప్ పాండేయ్ న్యాయవాదిగా పనిచేస్తున్నారు.

Also Read:దోషి అక్షయ్ కుమార్ సింగ్ రివ్యూ పిటీషన్ కొట్టివేత: నిర్భయ తల్లి హర్షం

ఈ ఘటనపై మీడియా ప్రతాప్‌ను ప్రశ్నించగా.. తీవ్ర భావోద్వేగానికి గురైయ్యారు. ఈ ఘటన జరిగిన ఏడేళ్లయ్యిందని, తమ కుమారుడు మరో జీవితం గడుపుతూ... పుణేలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడని ఆయన తెలిపారు. నిర్భయ దోషులకు ఉరిశిక్ష విధించాలని తమ కుమారుడు కోరుకుంటున్నాడని ప్రతాప్ వెల్లడించారు. 

ఇకపోతే నిర్భయ కేసులో నలుగురు దోషులలో ఒకరైన అక్షయ్ కుమార్ సింగ్ తనకు వేసిన ఉరిశిక్షపై పునరాలోచించాలని సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్ ను దాఖలు చేశారు. అక్షయ్ కుమార్ సింగ్ రివ్యూ పిటీషన్ ను జస్టిస్ ఆర్ భానుమతి నేతృత్వంలోని నూతన త్రి సభ్య ధర్మాసనం కొట్టివేసింది.

దోషి అయిన అక్షయ్ కుమార్ పై త్రిసభ్య ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. నలుగురు నిందితులను ఉరి తీయాల్సిందేనని అభిప్రాయపడింది. దోషులపై ఎలాంటి దయ అవసరం లేదని స్పష్టం చేసింది ధర్మాసనం అభిప్రాయపడింది.

నలుగురు నిందితులను ఉరితీయాల్సిందేనని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. నిందితులు క్షమించరాని నేరం చేశారని ధర్మాసనం అభిప్రాయపడింది. దోషికి క్షమాపణ కోరే అర్హత లేదని స్పష్టం చేసింది. 

Also Read:నిర్భయ దోషి అక్షయ్ కుమార్ సింగ్ రివ్యూ పిటీషన్ కొట్టివేత

మరోవైపు త్రిసభ్య ధర్మాసనం వెల్లడించిన తీర్పుపై అసహనం వ్యక్తం చేశారు నిందితుడు తరపు న్యాయవాది ఏపీ సింగ్. సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటీషన్ దాఖలు చేస్తామని స్పష్టం చేశారు. 

అలాగే క్షమాభిక్ష పిటీషన్ కు సంబంధించి మూడు వారాల సమయం గడువు అడిగారు నిందితుడు తరపు న్యాయవాది ఏపీ సింగ్. అయితే అందుకు త్రిసభ్య ధర్మాసనం అంగీకరించలేదు. కేవలం ఒక వారం రోజులపాటు సమయం ఇస్తున్నట్లు స్పష్టం చేసింది.  
 

click me!