చివరి కోరికగా... అవయవదానం చేసిన నిర్భయ దోషి

Published : Mar 20, 2020, 12:00 PM IST
చివరి కోరికగా... అవయవదానం చేసిన నిర్భయ దోషి

సారాంశం

నిర్భయ కేసులో దోషి అయిన ముకేష్ సింగ్ తనను ఉరి తీసిన తర్వాత, తన అవయవాలను దానం చేయాలని కోరాడు. కాగా అతని నిర్ణయం విన్న ప్రతి ఒక్కరూ షాకయ్యారు. 

న్యాయం కోసం ఎనిమిదేళ్లుగా చేస్తున్న సుదీర్ఘ నిరీక్షణకు నేటితో తెరపడింది. నిర్భయ దోషులు నలుగురికి న్యాయస్థానం శుక్రవారం ఉదయం ఉరిశిక్ష విధించింది. ఉరి తప్పించుకునేందుకు దోషులు నలుగురు చివరి వరకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే..వాళ్ల ప్రయత్నాలేమీ ఫలించలేదు. చివరకు న్యాయమే గెలిచింది. నలుగురు దోషులు ఉరికి వేలాడారు.

Also Read అశాంతితో నిర్భయ దోషులు: నిద్రపోలేదు, తినలేదు, స్నానానికి నిరాకరణ...

కాగా... ఉరికి ముందు నిర్భయ దోషుల్లో ఒకడైన ముఖేష్ సింగ్ తీసుకున్న ఓ నిర్ణయం మాత్రం అందరిని విస్మయానికి గురిచేసింది.  నిర్భయ కేసులో దోషి అయిన ముకేష్ సింగ్ తనను ఉరి తీసిన తర్వాత, తన అవయవాలను దానం చేయాలని కోరాడు. కాగా అతని నిర్ణయం విన్న ప్రతి ఒక్కరూ షాకయ్యారు. ఒక ఆడపిల్లను అతి కిరాతకంగా హింసకు గురిచేసిన ఈ దోషుల్లో కూడా మానవత్వం ఉందా అనే అనుమానం కలిగింది. జైల్లో ఉన్న కొద్దికాలంలో ఆమాత్రం మార్పు వచ్చి ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

మరో దోషి అయిన వినయ్ శర్మ తిహార్ జైలులో ఉన్నపుడు పెయింటింగ్ వేశారు. తాను వేసిన పెయింటింగుతోపాటు తన వద్ద ఉన్న హనుమాన్ చాలీసాను ఉరి తీశాక తన కుటుంబసభ్యులకు అందజేయాలని తిహార్ జైలు అధికారులకు సూచించారు. మిగిలిన ఇద్దరు దోషులైన పవన్ గుప్తా, అక్షయ్ సింగ్ ఠాకూర్ లు మాత్రం ఎలాంటి కోరికలు కోరలేదు. ఉరి తీసే ముందు తెల్లవారుజామున 4.45 గంటలకు జిల్లా మెజిస్ట్రేట్ నేహాల్ బన్సాల్ నిర్భయ దోషుల వద్దకు వెళ్లగా వారు ఈ మేర కోరారు.

PREV
click me!

Recommended Stories

UPSC Interview Questions : గోరింటాకు పెట్టుకుంటే చేతులు ఎర్రగానే ఎందుకు మారతాయి..?
Best Mileage Cars : బైక్ కంటే ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లు ఇవే.. రూ.30 వేల శాలరీతో కూడా మెయింటేన్ చేయవచ్చు