కరోనాతో మరొకరు మృతి: ఇండియాలో ఐదో మరణం

Published : Mar 20, 2020, 11:20 AM ISTUpdated : Mar 20, 2020, 11:31 AM IST
కరోనాతో మరొకరు మృతి: ఇండియాలో ఐదో మరణం

సారాంశం

కరోనా వైరస్ కారణంగా దేశంలో మరొకరు మృతి చెందారు. దీంతో ఈ వ్యాధితో మరణించిన వారి సంఖ్య ఐదుకు చేరింది. రాజస్థాన్ రాష్ట్రంలో  ఇటలీకి చెందిన టూరిస్ట్ శుక్రవారం నాడు మృతి చెందాడు.

న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా దేశంలో మరొకరు మృతి చెందారు. దీంతో ఈ వ్యాధితో మరణించిన వారి సంఖ్య ఐదుకు చేరింది. రాజస్థాన్ రాష్ట్రంలో  ఇటలీకి చెందిన టూరిస్ట్ శుక్రవారం నాడు మృతి చెందాడు.

ఇటలీ నుండి వచ్చిన టూరిస్ట్ ఈ వ్యాధితో మరణించాడు. ఇటలీ నుండి ఓ బృందం ఇండియాలో పర్యటించేందుకు వచ్చింది. ఎయిర్ పోర్టులో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించిన సమయంలో ఈ వ్యక్తికి  కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టుగా తేలింది.

also read:కరోనా కట్టడికి అన్ని చర్యలు: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి

దీంతో వైద్యులు అతడిని ఐసోలేషన్ వార్డుకు తరలించారు.ఇదే బృందంలో ఉన్న 14 మందికి కూడ కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టుగా గుర్తించారు.ఇటలీ నుండి వచ్చిన టూరిస్ట్  వయస్సు 69 ఏళ్లు.  వయస్సు కారణంగానే ఈ టూరిస్ట్ మృతి చెందినట్టుగా వైద్యులు అభిప్రాయపడుతున్నారు.

మృతుడి భార్య కరోనా వ్యాధి నుండి కోలుకొంటుంది.  ఇప్పటికే ఇండియాకు చెందిన నలుగురు మృతి చెందారు. ఇటలీకి చెందిన టూరిస్ట్ మృతి చెందాడు. దేశ వ్యాప్తంగా సుమారు 200లకు పైగా కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టుగా  కేంద్రం ప్రకటించింది.

PREV
click me!

Recommended Stories

Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్