మరో ట్విస్ట్: నిర్భయ కేసు దోషి వినయ్ శర్మకు స్లో పాయిజన్

By telugu teamFirst Published Jan 25, 2020, 12:08 PM IST
Highlights

నిర్భయ కేసులో దోషి వినయ్ శర్మకు స్లో పాయిజన్ ఇచ్చారని, దాంతో అతను ఆస్పత్రి పాలయ్యాడని, అందుకు సంబంధించిన పత్రాలను జైలు అధికారులు ఇవ్వడం లేదని అతని తరఫు న్యాయవాది ఏపీ సింగ్ పాటియాలా కోర్టుకు తెలిపారు.

న్యూఢిల్లీ: నిర్భయ కేసు దోషుల విషయంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. నిర్భయ కేసు దోషుల్లో ఒక్కడైన వినయ్ శర్మకు స్లో పాయిజన్ ఇచ్చారని, దాంతో అతను ఆస్పత్రి పాలయ్యాడని, అతని మెడికల్ రిపోర్ట్స్ ఇవ్వడం లేదని నిర్భయ రేప్ కేసు దోషుల తరఫున న్యాయవాది ఏపీ సింగ్ ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టుకు తెలిపారు. 

శనివారం కోర్టు విచారణ సందర్భంగా ఏపీ సింగ్ ఆ విషయం చెప్పారు. దోషులు మెర్సీ పిటిషన్ పెట్టుకోవడానికి అవసరమైన పత్రాలను ఇవ్వడంలో తీహార్ జైలు అధికారులు జాప్యం చేస్తున్నారని ఆయన కోర్టుకు తెలిపారు ఈ మేరకు తన దరఖాస్తును ఈ నెల 24వ తేదీన కోర్టుకు సమర్పించారు. 

Also Read: కుటుంబ సభ్యులతో భేటీపై సైతం నోరు విప్పని నిర్భయ కేసు దోషులు

దోషులు వినయ్ కుమార్ శర్మ (26) మెర్సీ పిటిషన్ పెట్టుకోవడానికి, అక్షయ్ కుమార్ సింగ్ (31), పవన్ గుప్తా (25) క్యురేటివ్ పిటిషన్లు దాఖలు చేసుకోవడానికి అవసరమైన పత్రాలను జైలు అధికారులు ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. 

ఉరిశిక్ష అమలు చేసే విషయంలో జాప్యం చేసే వైఖరులను దోషులు అనుసరిస్తున్నారని పోలీసుల తరఫునన కోర్టుకు హాజరవుతున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ విమర్శించారు.

Also Read: చివరి కోరికపై మౌనంగా నిర్భయ దోషులు.. ఎందుకంత ధీమా?

వినయ్, ముకేష్ సింగ్ ల క్యురేటివ్ పిటిషన్లను సుప్రీంకోర్టు ఇటీవల డిస్మిస్ చేసిన విషయం తెలిసిందే. ముకేష్ మెర్సీ పిటిషన్ ను రాష్ట్రపతి కూడా తోసిపుచ్చారు. నిర్భయ కేసు దోషులను నలుగురిని ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 6 గంటలకు ఉరి తీయాలని డెత్ వారంట్ జారీ అయింది.

click me!