మావోయిస్ట్ జోన్ లో తొమ్మిదో తరగతి విద్యార్థినిపై హత్యాచారం.. గొంతుకోసి, నగ్నంగా మృతదేహం..

Published : Jul 22, 2022, 10:10 AM IST
మావోయిస్ట్ జోన్ లో తొమ్మిదో తరగతి విద్యార్థినిపై హత్యాచారం.. గొంతుకోసి, నగ్నంగా మృతదేహం..

సారాంశం

ఛత్తీస్‌గఢ్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. స్కూలుకు వెళ్లిన తొమ్మిదో తరగతి విద్యార్థిని.. మావోయిస్ట్ ప్రాంతంలో విగతజీవిగా దొరికింది. ఆమె మీద అత్యాచారం చేసి.. అతి దారుణంగా హత్య చేశారు. 

రాయ్‌పూర్ : Chhattisgarhలోని రాజ్‌నంద్‌గావ్ జిల్లాలో జూలై 19న ఓ బాలిక అదృశ్యం అయ్యింది. ఆ రోజు స్కూలుకు వెళ్లిన తొమ్మిదో తరగతి బాలిక ఆ తరువాత కనిపించకుండా పోయింది. మరుసటి రోజు మావోయిస్టు ప్రాంతంలో నగ్నంగా, చిత్రహింసలకు గురిచేసి, గొంతు కోసి చంపిన స్థితిలో కనిపించింది. 

ఆమెపై gang rape జరిగినట్లు అనుమానిస్తున్న పోలీసులు postmortem నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు. అది మావోయిస్టుల జోన్ కావడంతో ఆకస్మిక దాడులు, IEDల ప్రమాదం ఉండడంతో.. వాటిని తనిఖీలు చేస్తూ.. అక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది. దీనికోసం సాయుధ స్క్వాడ్‌ను పంపవలసి ఉన్నందున మృతదేహాన్ని తీసుకురావడం పొందడం పోలీసులకు సవాలుగా మారింది. ఆ ప్రాంతంలో మొబైల్ నెట్‌వర్క్‌లు లేకపోవడంతో విచారణ కుంటుపడింది.

రాజ్‌నంద్‌గావ్ ఎస్పీ ప్రఫుల్ ఠాకూర్ మాట్లాడుతూ, జూలై 19 రాత్రి బాలిక తప్పిపోయినట్లు ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ప్రతీరోజు ఆమె మధ్యాహ్నం 2.30 గంటలకు పాఠశాల నుండి తిరిగి వస్తుందని, అయితే ఆ రోజు ఇంటికి రాలేదని వారు తెలిపారు. వారి  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వెంటనే ఆమె కోసం గాలింపు చేపట్టారు. మరుసటి రోజు, ఒక గొర్రెల కాపరి 16 ఏళ్ల బాలిక మృతదేహాన్ని డోంగర్‌ఘర్‌లోని డంగోరా డ్యామ్ సమీపంలోని నిర్జన ప్రదేశంలో అత్యంత భయంకరమైనస్థితిలో చూశాడు. అది మావోయిస్టు ప్రభావిత ప్రాంతం. దీంతో అన్ని భద్రతా జాగ్రత్తలతో పోలీసు బృందాన్ని అక్కడికి పంపాం”అని ఎస్పీ తెలిపారు.

కిటీకీ అద్దంతో భార్య, కూతుళ్లపై దాడి.. ఒకరు మృతి...

ఆ అమ్మాయి ఒంటిమీద ఎటువంటి దుస్తులు లేవు, కానీ ఆమె కాళ్లకు స్కూల్ బూట్లు, సాక్సులు మాత్రం ఉన్నాయి. ఆమె గొంతు కోసి ఉంది. హత్యకు ముందు ఆమెపై అత్యాచారం చేసి దాదాపు 50 మీటర్ల మేర పొదల్లోకి లాక్కెళ్లినట్లు స్పష్టమైందని ఎస్పీ తెలిపారు. యువతి మోటార్‌సైకిల్‌పై యువకుడితో కలిసి పిలియన్‌ రైడింగ్‌ చేస్తున్న సీసీటీవీ ఫుటేజీని పోలీసులు గుర్తించారు.

దీనిమీద మాట్లాడుతూ.. పోలీసులు అక్కడికి వెళ్లేసరికి బాలిక గొంతు కోసి ఉంది. హత్యకు ముందు ఆమెపై అత్యాచారం చేసి దాదాపు 50 మీటర్ల మేర పొదల్లోకి లాక్కెళ్లినట్లు తెలుస్తోంది అని ఎస్పీ అన్నారు. అంతేకాదు హత్యకు ముందు బాలిక మోటార్‌సైకిల్‌పై ఓ యువకుడితో కలిసి వెడుతున్న సీసీటీవీ ఫుటేజీని కూడా పోలీసులు గుర్తించారు. అయితే, ఈ బైక్‌కు నంబర్ ప్లేట్ లేదు. అనుమానాల ఆధారంగా ఓ 21 ఏళ్ల యువకుడిని పట్టుకున్నారు. విచారణలో అతను.. తాను ఆ అమ్మాయితో స్నేహం చేస్తున్నానని, అయితే ఘటన జరిగిన రోజు ఆమెను కలవలేదని చెప్పాడు. 

బాలిక తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక సదరు యువకుడితో చాట్ చేసేందుకు ఆమె తల్లి ఫోన్‌ను ఉపయోగించింది. ఈ హత్యాచారంలో మరెవరికైనా ప్రమేయం ఉందా, ఎలాంటి పరిస్థితులు నేరానికి దారితీశాయి. అనే దానిపై ఇంకా దర్యాప్తు జరుగుతోందని ఎస్పీ తెలిపారు. ఆ ప్రాంతం మొబైల్ డార్క్ జోన్‌ కాబట్టి.. లొకేషన్‌లో యాక్టివ్‌గా ఉన్న మొబైల్ నంబర్‌ల జాడను పోలీసులు ఇంకా కనిపెట్టలేదు. ఘటన జరిగిన రోజున ఘటనా స్థలానికి సమీపంలో దొరికిన ఫోన్ నంబర్లను పోలీసులు పరిశీలిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !