సాహిల్‌‌కు హెల్ప్ చేసిన పోలీసు.. నిక్కీ హత్య కేసులో వెలుగులోకి కీలక విషయాలు..

Published : Feb 19, 2023, 03:03 PM IST
సాహిల్‌‌కు హెల్ప్ చేసిన పోలీసు.. నిక్కీ హత్య కేసులో వెలుగులోకి కీలక విషయాలు..

సారాంశం

ఢిల్లీలో జరిగిన నిక్కీ యాదవ్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిక్కీని హత్య చేసి, ఆ తర్వాత మృతదేహాన్ని ఫ్రిజ్‌లో దాచిన ఘటనలో ప్రమేయం ఉన్నవారిలో ఢిల్లీకి చెందిన ఒక పోలీసు కానిస్టేబుల్‌ కూడా ఉన్నట్టుగా తేలింది.

ఢిల్లీలో జరిగిన నిక్కీ యాదవ్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిక్కీని హత్య చేసి, ఆ తర్వాత మృతదేహాన్ని ఫ్రిజ్‌లో దాచిన ఘటనలో ప్రమేయం ఉన్నవారిలో ఢిల్లీకి చెందిన ఒక పోలీసు కానిస్టేబుల్‌ కూడా ఉన్నట్టుగా తేలింది. నిక్కీ యాదవ్‌ను ఆమె భాగస్వామి సాహిల్ గెహ్లాట్ ఛార్జింగ్ కేబుల్‌తో హత్య చేశాడు.. అనంతరం ఫ్రిజ్‌లో దాచిపెట్టాడు. అయితే ఈ కుట్రలో సాహిల్‌కు అతడి తండ్రి, ఇద్దరు బంధువులు, ఇద్దరు స్నేహితులు సహాయం చేశారని పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఒకరైన సాహిల్ బంధువు నవీన్ ఢిల్లీ పోలీసులో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. 

ఇక, నిక్కీ యాదవ్-సాహిల్‌లు 2020లో వివాహం చేసుకున్నట్లు పోలీసు వర్గాలు శనివారం వెల్లడించాయి. అయితే సాహిల్ గెహ్లాట్ కుటుంబం ఈ వివాహాన్ని ఆమోదించలేదు. నిక్కీ యాదవ్‌ను వదిలించుకోవాలని.. తద్వారా అతను మరొక మహిళను వివాహం చేసుకోవాలని వారు కోరుకున్నారు. ‘‘అనేక సందర్భాల్లో నిక్కీ యాదవ్‌ను విడిచిపెట్టాలని నిందితులు సహిల్‌ను ఒప్పించారు. వారు అతనిపై ఒత్తిడి తెస్తూనే ఉన్నారు’’ అని ఒక పోలీసు అధికారి తెలిపినట్టుగా పీటీఐ రిపోర్టు చేసింది. 

సాహిల్ కుటుంబం అతడికి 2022 డిసెంబరులో మరో మహిళతో వివాహాన్ని నిర్ణయించుకుంది. ఆ తర్వాత నిక్కీని చీకటిలో ఉంచారు. తాను మరో మహిళను పెళ్లి చేసుకోబోతున్న విషయాన్ని నిక్కీ వద్ద సాహిల్ దాచిపెట్టాడు. ఇక, మరో మహిళతో పెళ్లి  రోజున.. ఈ విషయంపై నిక్కీకి, సాహిల్‌కు గొడవ జరిగింది. అదే రోజు సాహిల్ ఛార్జింగ్ కేబుల్‌తో నిక్కీ యాదవ్‌ గొంతు కోశాడు.  అయితే ఇతర నిందితులతో కలిసి పెళ్లి రోజుకి ముందే నిక్కీ యాదవ్‌ను హత్య చేయాలని సాహిల్  ప్లాన్ చేశాడు. హత్య తర్వాత మృతదేహాన్ని ఫ్రిజ్‌లో ఉంచడానికి నిందితులు సాహిల్‌కు సాయం చేశారు.

Also Read: రెండో పెళ్లి వద్దన్నందుకు దుర్మార్గం.. గతంలోనే నిక్కీ సాహిల్ ల వివాహం

‘‘మృతదేహం ఫ్రెష్‌గా ఉంటుందని.. ఎలాంటి దుర్వాసన రాదని భావించి ఫ్రిజ్‌లో ఉంచారు. పెళ్లిలో కనీసం మూడు రోజుల పాటు బిజీబిజీగా ఉండటం వల్ల ఎవరూ అసాధారణంగా ఏమీ అనుమానించలేరు లేదా గుర్తించలేరు. ఆమె మృతదేహాన్ని తర్వాత పారవేయాలని నిందితులు భావించారు’’ అని ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి.

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !