ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద పేలుడు: భారీ విధ్వంసానికి స్కెచ్, కుదరక పూలకుండిలో .. ఎన్ఐఏ చేతిలో ఆధారాలు

By Siva KodatiFirst Published Jun 15, 2021, 8:09 PM IST
Highlights

ఢిల్లీలో బాంబు పేలుళ్ల కేసులో కీలక ఆధారాలు సేకరించింది ఎన్ఐఏ. పేలుడు పదార్థాలు పెట్టినట్లుగా భావిస్తున్న ఇద్దరు అనుమానితుల ఫుటేజ్‌ను విడుదల చేసింది. ఇందులో ఇద్దరు వ్యక్తులు ఇజ్రాయెల్ ఎంబసీ ముందు అనుమానాస్పదంగా తచ్చాడుతూ కనిపించారు

ఢిల్లీలో బాంబు పేలుళ్ల కేసులో కీలక ఆధారాలు సేకరించింది ఎన్ఐఏ. పేలుడు పదార్థాలు పెట్టినట్లుగా భావిస్తున్న ఇద్దరు అనుమానితుల ఫుటేజ్‌ను విడుదల చేసింది. ఇందులో ఇద్దరు వ్యక్తులు ఇజ్రాయెల్ ఎంబసీ ముందు అనుమానాస్పదంగా తచ్చాడుతూ కనిపించారు. 2021 జనవరి 29న ఇజ్రాయెల్- ఇండియాల మధ్య దౌత్య సంబంధాలు మొదలై 29 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా అలజడి సృష్టించేందుకు కొందరు ఉగ్రవాదులు యత్నించారు.

Also Read:ఢిల్లీ పేలుళ్లు : ఇద్దరు అనుమానితుల గుర్తింపు.. ట్రయల్ మాత్రమే !

ఇజ్రాయెల్‌ను ప్రత్యేక దేశంగా గుర్తింపు ఇవ్వడాన్ని నిరసిస్తూ భారీ పేలుడుకు ప్రణాళిక రూపొందించారు. అయితే గట్టి భద్రత ఉండటంతో వారి ప్లాన్ అనుకున్న విధంగా జరగలేదు. ఈ నేపథ్యంలో జనవరి 29న ఇజ్రాయెల్ ఎంబసీ పక్కనే వున్న జిందాల్ హౌస్ ఎదుట పూల కుండీలో పేలుడు పదార్థాలను ఉంచారు. సాయంత్రం సమయంలో పేలుడు సంభవించినా పెద్దగా నష్టం చోటు చేసుకోలేదు. అయితే పేలుడు వెనుక ఎవరున్నారనే దానిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాయి. 
    

click me!