దర్భాంగా పేలుడులో కీలక పరిణామం: జమ్మూలో మరొకరి అరెస్ట్

By narsimha lodeFirst Published Jul 26, 2021, 3:12 PM IST
Highlights

దర్బాంగా పేలుడు కేసులో జమ్మూలో నివాసం ఉంటున్న ఇజార్ ను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశార. హైద్రాబాద్ లోని మాలిక్ సోదరులతో కలిసి ఇజార్ ఈ కుట్రలో పాలుపంచుకొన్నాడని ఎన్ఐఏ గుర్తించింది.

న్యూఢిల్లీ: దర్బాంగా పేలుడులో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో నివాసం ఉంటున్న ఇజార్‌ అనే వ్యక్తిని  ఉత్తర్‌ప్రదేశ్  ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తర్‌ప్రదేశ్ ఏటీఎస్ పోలీసులు కాశ్మీర్ లో ఉంటున్న ఇజార్ ను అరెస్ట్ చేశారు. హైద్రాబాద్ కు చెందిన మాలిక్ సోదరులతో కలిసి దర్బాంగా పేలుడుకు ఇజార్ కూడ కుట్ పన్నారని  ఎన్ఐఏ అనుమానిస్తుంది. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇజార్ కొంతకాలం క్రితం జమ్మూ కాశ్మీర్ కు వెళ్లాడు. అక్కడే పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.  

also read:ఒక్కో బ్లాస్ట్‌కి రూ. కోటి నజరానా: దర్బాంగా బ్లాస్ట్‌లో సంచలన విషయాలు

పాకిస్తాన్  కు చెందిన లష్కరే తోయిబా కీలక నేత ఇక్బాల్ తో ఇజార్‌ సంప్రదింపులు జరిపేవాడని ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. ఇజార్ ను అరెస్ట్ చేసిన  పోలీసులు పాట్నాలోని ఎన్ఐఏ కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసులో విచారణ చేసేందుకుగాను కస్టడీకి అనుమతించాలని  కోర్టులో ఎన్ఐఏ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు.ఈ ఏడాది జూన్ 17వ తేదీన బీహార్‌లో దర్భాంగా పేలుడు చోటు చేసుకొంది.ఈ పేలుడులో ఇప్పటికే 17 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
 

click me!