యడియూరప్ప రాజీనామా: బిజెపి అధిష్టానం పరిశీలనలో ఉన్న నేతలు వీరే

By telugu teamFirst Published Jul 26, 2021, 1:11 PM IST
Highlights

కర్ణాటక ముఖ్యమంత్రిగా యడియూరప్ప రాజీనామా చేయడంతో తదుపరి సీఎం ఎవరనే విషయంపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ముఖ్యమంత్రి ఎంపికపై బిజెపి అధిష్టానం ఫోకస్ పెట్టింది.

బెంగుళూరు: యడియూరప్ప రాజీనామా చేసిన నేపథ్యంలో తదుపరి కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరనే విషయంపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ప్రధానంగా మురుగేష్ నిరాని, ప్రహ్లాజ్ జోషీ, అరవింద్ బళ్లాడ్ పేర్లు బిజెపి అధిష్టానం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. పార్లమెంటు ఆవరణలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బిజెపి జాతీయాధ్యక్షుడు జేపి నడ్డా సమావేశమయ్యారు.  

నిరాని లింగాయత్ వర్గానికి చెందినవారు. లింగాయత్ ల మద్దతు ఉన్న యడియూరప్పను బిజెపి పక్కన పెట్టింది. బిజెపి నియమావళి ప్రకారం వయస్సు మీద పడినందున రాజీనామా చేస్తున్నట్లు యడియూరప్ప ప్రధాని నరేంద్ర మోడీకి చెప్పినట్లు వార్తలు వచ్చాయి.

కాగా, కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తూ బిఎస్ యడియూరప్ప లేఖను గవర్నర్ కు సమర్పించారు. తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రటించిన కొద్దిసేపటికే ఆయన గవర్నర్ వద్దకు వెళ్లి లేఖను సమర్పించారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తానని యడియూరప్ప చెప్పారు. ఆయన రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. తదుపరి ముఖ్యమంత్రి వచ్చే వరకు ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు.

కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప చేస్తున్నట్లు ప్రకటించారు. గత కొన్ని రోజులుగా ఆయన రాజీనామాపై ఊహాగానాలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఆ ఊహాగానాలకు తెర దించుతూ ఆయన రాజీనామా చేశారు. 

ముఖ్యమంత్రిగా యడియూరప్ప రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. తన ప్రభుత్వం రెండేళ్ల వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన కంటతడి పెట్టారు. కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఉద్వేగాన్ని నిలువరించుకోలేకపోయారు.  తాను కర్ణాటక ముఖ్యమంత్రిగా తాను రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. 

అటల్ బిహారీ వాజ్ పేయి ప్రధానిగా ఉన్నప్పుడు కేంద్ర మంత్రివర్గంలో చేరాలని అడిగారని, అయితే తాను కర్ణాటక రాజకీయాల్లోనే ఉంటానని చెప్పానని ఆయన అన్నారు. కర్ణాటక శాసనసభలో ఆయన మాట్లాడారు. 

ఎళ్ల వేళలా తనకు అగ్నిపరీక్ష ఎదరువుతూనే ఉన్నదని, గత రెండేళ్ల పాటు కోవిడ్ ఇబ్బంది పెట్టిందని ఆయన అన్నారు. దాదాపు రెండు గంటల పాటు ఆయన మాట్లాడారు. రెండేళ్ల పాటు ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపినట్లు తెలిపారు. 

click me!