Next chief of Defense staff: త‌దుప‌రి త్రిదళాధిపతి ఆయ‌న‌నే..?

By Rajesh KFirst Published Dec 9, 2021, 2:38 PM IST
Highlights

Next chief of Defense staff: భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ దుర్మరణం చెందిన విష‌యం తెలిసిందే. తమిళనాడులో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయ‌ప‌డిన ఆయ‌న ప్రాణాలను కాపాడేందుకు డాక్ట‌ర్లు ఎంత‌గానో ప్ర‌యత్నించారు. అయినా.. ఆయ‌న ప్రాణాలు దక్కలేదు. ఈ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన సతీమణి సహా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై దేశ వ్యాప్తంగా  దిగ్బ్రాంతి వ్యక్తమవుతోంది. ఈ త‌రుణంలో ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు? తదుపరి సీడీఎస్​గా ఎవరు బాధ్యతలు తీసుకుంటారని చర్చ మొదలైంది.
 

Next chief of Defense staff: భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ దుర్మరణం చెందిన విష‌యం తెలిసిందే. బుధ‌వారం మ‌ధ్యాహ్నం తమిళనాడులోని కూనూర్ లో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో ఆయ‌న ప్రాణాలను కోల్పోయారు. ఈ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన సతీమణి సహా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న‌పై దేశ వ్యాప్తంగా దిగ్బ్రాంతి వ్యక్తమవుతోంది. ఈ త‌రుణంలో ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు? తదుపరి సీడీఎస్​గా ఎవ‌రు వ్య‌వ‌హ‌రిస్తారు? అస‌లు ఆయ‌న భాద్య‌త‌లేంటి? అనే ప్ర‌శ్న‌లు తెర మీదికి వ‌స్తోన్నాయి. దేశ‌వ్యాప్తంగా ఈ అంశాల‌పై చ‌ర్చ న‌డుస్తోంది.  

బిపిన్ రావత్​ భారత సైన్యంలో  దాదాపు 43 ఏళ్ల పాటు సేవలు అందించారు. ఆర్మీ చీఫ్‌గా జనరల్ రావత్‌ నుంచే రావ‌త్  2019 డిసెంబరు 31న సీడీఎస్ గా బాధ్యతలు చేపట్టారు. ఆయ‌న కేరీర్ లో ఎన్నో పుస్కారాలు, ఎన్నో అవార్డులు, ఎన్నో రివార్డులు అందుకున్నారు. అలాగే.. ఆయ‌న ఎన్నో సంస్కరణలు  తీసుకురావడంలో కీల‌క పాత్ర పోషించారు.

Read Also: https://telugu.asianetnews.com/national/tri-service-enquiry-into-bipin-rawat-chopper-crash-rajnath-singh-announced-in-parliament-r3u41e

అయితే.. రావ‌త్ ఆక‌స్మిక మ‌ర‌ణ త‌రువాత ..త‌దుప‌రి సీడీఎస్ గా ఎవ‌రు వ్య‌వ‌హ‌రించనున్నార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం ప‌రిస్థితుల‌కు ప‌రిశీలిస్తే.. ప్రస్తుత సైన్యాధిపతి జనరల్​ మనోజ్​ ముకుంద్​ నరవాణెకు త్రిదళాధిపతి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప‌దవికి సీనియార్టీ ప్ర‌కారం భర్తీ చేస్తారు. ఆర్మీ, నేవీ, వాయుసేన ఈ మూడు దళాల అధిపతుల్లో ఓ సీనియ‌ర్ అధికారిని ఈ ప‌ద‌వికి ఎంపిక చేస్తారు.

అయితే.. నేవీ, వాయుసేనల అధిపతులు ఇటీవల‌నే నియ‌మితుల‌య్యారు. వారిలో  సీనియర్‌ అయిన ఆర్మీ జనరల్‌ నరవణెకే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఆర్మీ చీఫ్‌గా జనరల్‌ రావత్‌ నుంచే ఆయన 2019 డిసెంబరు 31న బాధ్యతలు చేపట్టారు. నేవీ అధినేత‌ అడ్మిరల్‌ ఆర్‌.హరి కుమార్‌ కేవలం ఎనిమిది రోజుల క్రితమే నియ‌మితుల‌య్యారు. అలాగే  వాయుసేన అధిపతి ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వివేక్‌ రామ్‌ చౌధరి కూడా ఇటీవ‌లే.. సెప్టెంబరు 30న బాధ్యతలు చేపట్టారు. దీంతో ఆర్మీ సీనియ‌ర్ అయినా.. జనరల్‌ నరవణెకే అవకాశాలు అధికంగా ఉన్నట్టు భావిస్తున్నారు.  

Read Also: https://telugu.asianetnews.com/national/tamil-nadu-cm-mk-stalinand-telangana-governor-tamilisai-soundararajan-pays-floral-tribute-to-bipin-rawat-and-others-who-died-in-the-coonoor-chopper-crash-r3u5mk

 మనోజ్ ముకుంద్ నరవాణె 2022, ఏప్రిల్​ వరకు ఆర్మీ అధిపతి జనరల్ గా కొన‌సాగునున్నారు. అనంత‌రం ప‌ద‌వి విర‌మ‌ణ చేయ‌నున్నారు. ఓ వేళా ఆయ‌న సీడీఎస్​గా నియామకమైతే.. ఆయ‌న ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌స్సు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే.. సీడీఎస్ ప‌దవి విరామ‌ణ వ‌య‌స్సును నిర్థారించ‌లేదు. ఈ ప‌ద‌విని చేపట్టే వ్య‌క్తికి 65 ఏళ్లు వచ్చే వరకు లేదా కనీసం మూడేళ్లు సీడీఎస్​గా బాధ్యతలు చేపట్టేందుకు ఆస్కారం ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్మీలో అత్యంత సీనియర్​ అయిన బిపిన్​ రావత్​ బాధ్యతలు చేపట్టిన పరిస్థితులను పరిశీలిస్తే.. సైన్యంలోని సీనియర్​ అధికారినే సీడీఎస్​గా ఎంపిక చేసే అవకాశం ఉంది. 

ఒకవేళ సీడీఎస్​గా నరవాణె  ఎంపిక చేస్తే.. ఆయ‌న స్థానంలో నార్తర్న్​ ఆర్మీ కమాండర్​ లెఫ్టినెంట్​ జనరల్​ యోగేష్​ కుమార్​ జోషి లేదా ఆర్మీ వైస్​ చీఫ్​ లెఫ్టినెంట్​ జనరల్​ చండీ ప్రసాద్​ మొహంతి భర్తీ చేసే అవకాశం ఉంది. మరోవైపు.. లెఫ్టినెంట్​ జనరల్​ జోషి.. వాయు, నేవీ చీఫ్​ల కంటే సీనియర్​ కావటం గమనార్హం.

Read Also:  https://telugu.asianetnews.com/national/wife-murders-husband-with-help-of-tech-lover-in-madhya-pradesh-r3ubuq

1999లో కార్గిల్‌ యుద్ధం అనంతరం ఏర్పాటు చేసిన‌ మంత్రివర్గ ఉపసంఘం.. త్రిదళాధిపతి (సీడీఎస్‌)  ప‌దవీని ఏర్పాటు చేయాల‌ని సూచించింది. ప్రపంచవ్యాప్తంగా అమెరికా, యూకే, ఫ్రాన్స్‌, జర్మనీ సహా 70కి పైగా దేశాలల్లో త్రిదళాధిపతి తరహా ప‌ద‌వీ ఉంది. మ‌న దేశంలో ఈ ప‌ద‌వినీ 2019 డిసెంబరు 31న ఏర్పాటు చేశారు.
  
బాధ్య‌త‌లేమిటీ? 

దేశంలో అత్యున్న‌త ప‌దవి సీడీఎస్.. ఈ ప‌దవీని చేపట్టే వారు.. ఆర్మీ, నేవీ, వాయు సేనలకు సమన్వయకర్తగా  విధులు నిర్వర్తిస్తుంటారు. త్రివిధ దళాలకు, ప్రభుత్వానికి మ‌ధ్య స‌మ‌న్వ‌య క‌ర్త‌గా,  సలహాదారుగా వ్య‌వ‌హ‌రిస్తారు. అణ్వాయుధాల కొనుగోళ్లు, నిర్వహణ, అలాగే వాటిలో వ‌చ్చే సమస్యల పరిష్కారం.  సైనిక ప్రణాళిక, సేకరణ విధానాలను క్రమబద్ధక‌ర చేస్తారు.అలాగే.. రక్షణ మంత్రిత్వశాఖతో సైనిక దళాల ప్రధాన కార్యాలయాలను ఏకీకృతం చేయడం, పౌర-మిలిటరీ మధ్య అంతరాన్ని తగ్గించడంలో కీల‌క పాత్ర పోషిస్తాడు.

click me!