
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు (five state election) సంబంధించిన పోలింగ్ నేటితో ముగిసింది. మార్చి 10వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలకు సంబంధించి వివిధ జాతీయ మీడియా సంస్థలు, ఏజెన్సీలు ఎగ్జిట్‌పోల్స్‌ను వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌కు సంబంధించి న్యూస్ 18 (news 18 exit poll Uttar Pradesh 2022) నిర్వహించిన సర్వే ఫలితాలను ప్రకటించింది. దీని ప్రకారం బీజేపీ ఏకైక పెద్ద పార్టీగా అవతరించే అవకాశాలు వున్నాయని ఎగ్జిట్ పోల్స్‌లో తెలిపింది. అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ మధ్యలోనే ఆగిపోతుందని, కాంగ్రెస్ కనీస పోటీ ఇవ్వక చతికిలపడుతుందని న్యూస్ 18 సర్వే వెల్లడించింది.
ఉత్తరప్రదేశ్ ఎగ్జిట్ పోల్స్ ఇలా వున్నాయి
బీజేపీ : 263 స్థానాలు
సమాజ్‌వాదీ పార్టీ : 123
బీఎస్పీ : 11
కాంగ్రెస్: 5