కరోనా కేసుల్లో కొత్త ట్విస్ట్: కోలుకొని డిశ్చార్జ్ అయ్యాక ఐదుగురు మృతి!

By Sree sFirst Published May 9, 2020, 2:40 PM IST
Highlights

రోనా వైరస్ నుంచి కోలుకొని గత నెలలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అయిదుగురు మరణించారు. ఈ ఘటన ముంబైలోని అతిపెద్ద మురికివాడ ధారావిలో చోటు చేసుకుంది. వీరంతా ఆసుపత్రిలో 14 రోజులపాటు చికిత్స పొంది డిశ్చార్జ్ అయినవారు. 

కరోనా వైరస్ మహమ్మారి కరాళనృత్యానికి భారతదేశం విలవిల్లాడిపోతోంది. ఈ మహమ్మారిలో తాజాగా బయటపడ్డ ఒక కొత్తకోణం ఇప్పుడు మరింత భయాందోళనలకు గురిచేస్తుంది. 

ఈ కరోనా వైరస్ నుంచి కోలుకొని గత నెలలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అయిదుగురు మరణించారు. ఈ ఘటన ముంబైలోని అతిపెద్ద మురికివాడ ధారావిలో చోటు చేసుకుంది. వీరంతా ఆసుపత్రిలో 14 రోజులపాటు చికిత్స పొంది డిశ్చార్జ్ అయినవారు. 

కరోనా వైరస్ నుంచి కోలుకున్నవారందరి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించడానికి ముంబై మునిసిపల్ అధికారులు ఈ పేషెంట్ల ఇంటికి వెళ్లగా వారంతా మరణించారని తెలుసుకొని అవాక్కయ్యారు. 

వారి మరణాలకు కారణం ఇప్పుడే చెప్పలేమని అధికారులు తెలిపారు. కరోనా వైరస్ మరలా తిరగబెట్టబట్టి వీరు మరణించారా, లేదా ఏవైనా ఇతర కారణాలు ఉన్నాయా అనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని, దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాల్సి ఉందని అధికారులు అన్నారు. 

ఆ మరణించిన వ్యక్తుల కుటుంబసభ్యుల సాంపిల్స్ ను మరోమారు సేకరించి టెస్టులకు పంపించారు అధికారులు. ఈ అతిపెద్ద మురికివాడలో ఇప్పటికే 808 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. నిన్న శుక్రవారం ఒక్కరోజే ఈ ధారావి ప్రాంతంలోని 25 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. 

ఇకపోతే.... భారతదేశంలో కరోనా వైరస్ మహమ్మారి విధ్వంసం సృష్టిస్తూనే ఉంది. శనివారం ఉదయం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం... కోవిడ్ -19 కేసుల సంఖ్య 60 వేలకు చేరువ కాగా, మరణాలు 2 వేలకు చేరువగా వచ్చాయి. దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 59,662 నమోదయ్యాయి. కరోనా వైరస్ మరణాల సంఖ్య 1,981కి చేరుకుంది.

ఇప్పటి వరకు కోరనా వ్యాధి నుంచి 17,846 మంది కోలుకున్నారు. దాంతో యాక్టవ్ కేసుల సంఖ్య 39,834 ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 3320 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 95 మరణాలు సంభవించాయి.

గత కొద్ది రోజులుగా భారతదేశంలో కరోనావైరస్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రతి రోజూ 3 వేలకుపైగానే కొత్త కోవిడ్ -19 కేసులు నమోదవుతూ వస్తున్నాయి. ఇప్పటి వరకు దేశంలో 216 జిల్లాలో కొత్తగా కరోనా వైరస్ కేసులు నమోదు కాలేదు. 

మహారాష్ట్రలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. మహారాష్ట్రలో కోవిడ్ -19 పాజిటివ్ కేసుల సంఖ్య 19,089కి చేరుకుంది. శుక్రవారంనాడు కొత్దగా 1,089 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 37 మదంి మృత్యువాత పడ్డారు. దీంతో మహారాష్ట్రలో మరణాల సంఖ్య 731కి చేరుకుంది.

లాక్ డౌన్ నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకుపోయిన పౌరులను వెనక్కి తీసుకుని రావడానికి భారత ప్రభుత్వం వందే భారత్ మిషన్ ను చేపట్టింది. తొలి రెండు విమానాలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో చిక్కుకపోయిన 363 మందిని కేరళకు తీసుకుని వచ్చాయి.

click me!