డిసెంబ‌ర్ 7 నుంచి పార్లమెంట్ శీతాకాల స‌మావేశాలు.. 16 కొత్త బిల్లుల‌ను ప్ర‌వేశపెట్ట‌నున్న కేంద్రం

By Mahesh RajamoniFirst Published Dec 2, 2022, 3:51 AM IST
Highlights

New Delhi: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో 16 కొత్త బిల్లులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. డిసెంబర్ 7 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇదే స‌మ‌యంలో ప్ర‌జా స‌మ‌స్య‌లు, ప్ర‌జా వ్య‌తిరేక ప్ర‌భుత్వ విధానాల‌ను ఎత్తిచూపడానికి ప్ర‌తిప‌క్షాలు సిద్ధ‌మ‌వుతున్నాయి. 
 

Parliament Winter Sessions: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో 16 కొత్త బిల్లులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. డిసెంబర్ 7 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇదే స‌మ‌యంలో ప్ర‌జా స‌మ‌స్య‌లు, ప్ర‌జా వ్య‌తిరేక ప్ర‌భుత్వ విధానాల‌ను ఎత్తిచూపడానికి ప్ర‌తిప‌క్షాలు సిద్ధ‌మ‌వుతున్నాయి. 

వివ‌రాల్లోకెళ్తే.. డిసెంబర్ 7 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బహుళ రాష్ట్రాల సహకార సంస్థల్లో జవాబుదారీతనాన్ని పెంపొందించడం, ఎన్నికల ప్రక్రియను మెరుగుపర్చడం సహా 16 కొత్త బిల్లులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. నేషనల్ డెంటల్ కమిషన్ బిల్లును కూడా రాబోయే సెషన్ లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. నేషనల్ డెంటల్ కమిషన్ ను ఏర్పాటు చేసి, దంతవైద్యుల చట్టం-1948ని రద్దు చేయాలని ఈ బిల్లు ప్రతిపాదించింది. దీనితో పాటు, నేషనల్ నర్సింగ్ కమిషన్‌కు సంబంధించిన బిల్లును కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇందులో నేషనల్ నర్సింగ్ కమిషన్ (ఎన్‌ఎన్‌ఎంసీ)ని ఏర్పాటు చేయాలనీ, ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ చట్టం-1947ను రద్దు చేయాలని ప్రతిపాదించారు. గురువారం విడుదల చేసిన లోక్‌సభ బులెటిన్ ప్రకారం.. సహకార సంఘాలలో పాలనను బలోపేతం చేయడం, పారదర్శకత, జవాబుదారీతనం, ఎన్నికల ప్రక్రియను మెరుగుపరచడం వంటి లక్ష్యంతో బహుళ-రాష్ట్ర సహకార సంఘాల (సవరణ) బిల్లు-2022 ప్రవేశపెట్టనున్నారు.
 
జ‌ర‌గ‌బోయే పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాల్లో ప్ర‌వేశ‌పెట్ట‌బోయే మ‌రో కీలక బిల్లు కంటోన్మెంట్స్ బిల్లు-2022.  ఈ సెషన్‌లోనే దీనిని ప్రవేశపెట్టే అవకాశం ఉన్న మరొక ముసాయిదా చట్టం. ఇతర లక్ష్యాలతో పాటు కంటోన్మెంట్లలో జీవన సౌలభ్యాన్ని పెంచాలని కూడా బిల్లు ప్రతిపాదిస్తుంది. అలాగే, ప్రవేశపెట్టే బిల్లుల జాబితాలో పాత గ్రాంట్స్ (నియంత్రణ) బిల్లు, అటవీ (పరిరక్షణ) సవరణ బిల్లు, తీర ఆక్వాకల్చర్ అథారిటీ (సవరణ) బిల్లు మొదలైనవి కూడా ఉన్నాయి.

కాగా, డిసెంబర్ 7 నుండి ప్రస్తుత భవనంలో పార్లమెంటు శీతాకాల సమావేశాలను నిర్వహించడానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయని, కొత్త భవనాన్ని పూర్తి చేయడానికి నవంబర్ గడువు ముగియడంతో, ప్రాజెక్టు పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారిక వర్గాలు గురువారం తెలిపాయి. కొత్త పార్లమెంటు భవనం భౌతిక పురోగతి 70 శాతం ఉందని గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్ కిశోర్ ఆగస్టు 4న లోక్సభకు తెలిపారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి నవంబర్ డెడ్ లైన్ అని ఆయన చెప్పారు. కోవిడ్-19 మహమ్మారితో పాటు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విదేశీ డెలివరీలను ప్రభావితం చేయడంతో సహా అనేక ఇతర అంశాలు ఉన్నాయనీ, ఇది కొత్త పార్లమెంటు భవనం నిర్మాణ పనులను ప్రభావితం చేసిందని వర్గాలు తెలిపాయి.

ప్రస్తుత పార్లమెంట్ భవనంలోనే శీతాకాల సమావేశాలను నిర్వహించేందుకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయని సంబంధిత వర్గాల సమాచారం. డిసెంబర్ 7 నుంచి సెషన్ ప్రారంభమై 29 వరకు కొనసాగనుంది. నవంబర్ 4న కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ కొత్త పార్లమెంట్ భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు.
 

click me!